సినిమా కోసం 36 ఎకరాలు అమ్మకం : సిద్ధాంత్‌ కర్నిక్‌

Dec 20,2023 19:30 #movie, #siddarth

సినిమాల కోసం దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా 36 ఎకరాల పొలాన్ని అమ్మేశారని నటుడు సిద్ధాంత్‌ కర్నిక్‌ వ్యాఖ్యానించారు. సందీప్‌కు సినిమా అంటే అమితమైన ఆసక్తి ఉందన్నారు. ఈనెల ఒకటోతేదీన యానిమల్‌ సినిమా విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమాలో నటించిన సిద్ధాంత్‌ కర్నిక్‌ తాజాగా చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. ‘సందీప్‌కు సాయం చేసేందుకు ఆయన కుటుంబ సభ్యులు పూర్వీకుల ఆస్తిని కూడా విక్రయించారు. యానిమల్‌ షూట్‌ వల్ల సందీప్‌రెడ్డి వంగా జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలు తెలుసుకోగలిగాను. సందీప్‌ సోదరుడు ప్రణయ్ నాతో చాలా విషయాలు పంచుకున్నారు. అసిస్టెంట్‌ దర్శకుడిగా సందీప్‌ ఫిల్మ్‌ కెరీర్‌ను మొదలు పెట్టారు. దర్శకుడిగా నిరూపించుకునేందుకు ఆయనకు ఎవరూ అవకాశాలు ఇవ్వకపోవటంతో స్నేహితులతో కలిసి నిర్మాణ సంస్థను ప్రారంభించి సినిమా చేయాలనుకున్నారు. మరో నెలరోజుల్లో తన తొలి చిత్రం మొదలు కానుందనగా… డబ్బులిస్తానన్నవారు చేతులెత్తేశారు. విషయం తెలుసుకున్న సందీప్‌ కుటుంబం ఆయనకు సపోర్ట్‌ చేసేందుకు ఊర్లో ఉన్న 36 ఎకరాల మామిడి తోటను విక్రయించింది. ఆ డబ్బుతోనే సందీప్‌ తొలి చిత్రం తెరకెక్కించారు’ అని వివరించారు.

➡️