హాలీవుడ్‌ ఫెస్టివల్‌కు ‘సత్య’

Dec 2,2023 19:53 #movies

సాయిధరమ్‌ తేజ్‌, స్వాతి ప్రధాన పాత్రల్లో నటించిన లఘు చిత్రం ‘సత్య’. ఇప్పటికే పలు అవార్డులు సొంతం చేసుకుంది. సైనికులకు నివాళులర్పిస్తూ ‘సోల్‌ ఆఫ్‌ సత్య’ అనే పాటను రూపొందించారు. ఆగస్టు 15న దీనిని విడుదల చేయగా మంచి వ్యూస్‌తో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తాజాగా ఈ షార్ట్‌ ఫిల్మ్‌కి మరో అరుదైన గౌరవం దక్కింది. ఈ నెల 9న ఈ చిత్రాన్ని హాలీవుడ్‌ బీఎల్‌వీడీ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ప్రదర్శించనున్నారు. ‘ఇది మా టీమ్‌ అందరికీ గర్వకారణం.’ అని సాయిధరమ్‌ తేజ్‌ ఇన్‌ స్టాలో పోస్ట్‌ చేశారు.

➡️