సిద్ధార్థ్‌, అదితి రావుల పెళ్లి

Mar 27,2024 19:30 #movie, #siddarth

నటి అదితిరావు హైదరీని నటుడు సిద్ధార్థ్‌ పెళ్లి చేసుకున్నట్లుగా సమాచారం. వనపర్తి జిల్లాలోని శ్రీ రంగాపూర్‌ రంగనాథ స్వామి దేవాలయంలో బుధవారం ఉదయం వీరి పెళ్లి జరిగినట్లుగా సమాచారం. ఇరు కుటుంబాల పెద్దలు, బంధువులు మాత్రమే ఈ వేడుకల్లో పాల్గన్నట్లుగా సమాచారం. అజరు భూపతి తెరకెక్కించిన ‘మహాసముద్రం’ సినిమాలో వీరిద్దరూ కలిసి పనిచేశారు. ఈ సినిమా షూట్‌లోనే వీరి మధ్య స్నేహం కుదిరింది. ఆ సినిమా తర్వాత వీరిద్దరూ కలిసి పలు పంక్షన్లకు కలిసి వెళ్లటం, పార్టీలకు హాజరుకావటంపై సామాజిక మాధ్యమాల్లో కథనాలు వచ్చాయి. తాజాగా పెళ్లిపై వార్తలు రావటంతో సిద్దార్థ్‌ అభిమానులు శుభాకాంక్షలు చెబుతూ పోస్టులు పెడుతున్నారు. వనపర్తి సంస్థానాధీశుల వారసుల్లో అదితిరావు ఒకరు. కాగా, వీరిద్దరికీ ఇది రెండో వివాహమే. గతంలో సిద్ధార్థ్‌కు మేఘనతో పెళ్లి జరిగింది. 2007లో వీరిద్దరూ విడిపోయారు. గతంలో సత్యదీప్‌ మిశ్రాతో అదితిరావుకు వివాహం కాగా, 2012లో విడాకులు తీసుకున్నారు.

➡️