‘‘దృఢంగా ఉండు జపాన్‌”.. జూనియర్‌ ఎన్టీఆర్‌ ట్వీట్‌

Jan 2,2024 12:33 #Earthquake, #Japan, #jr ntr, #Tweet
  • జపాన్‌ నుంచి హైదరాబాద్‌కు చేరిక

హైదరాబాద్‌ :షుటింగ్‌కు విరామం లభించడంతో క్రిస్మస్‌, న్యూఇయర్‌ వేడుకలను ఫ్యామిలీతో కలిసి జరుపుకునేందుకు జపాన్‌కు వెళ్లిన జూనియర్‌ ఎన్టీఆర్‌ తిరిగి హైదరాబాద్‌ చేరుకున్నాడు. తీవ్ర భూకంపం సంభవించిన కొన్ని గంటల తర్వాత ఆయన బయలుదేరి స్వదేశానికి వచ్చేశాడు. తీవ్ర భూకంపం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. ఈ మేరకు ‘ఎక్స్‌’ వేదికగా స్పందించాడు.”జపాన్‌ నుంచి ఈరోజు ఇంటికి తిరిగొచ్చాను. తీవ్ర భూప్రకంపాలు సంభవించడం షాక్‌కు గురిచేసింది. గత వారం అంతా అక్కడే గడిపాను. భూకంప ప్రభావితమైన వారందరికీ నా సానుభూతి తెలియజేస్తున్నాను. త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను. దృఢంగా ఉండు జపాన్‌” అంటూ సోమవారం అర్ధరాత్రి ఆయన ఎక్స్‌ వేదికగా ఆయన రాసుకొచ్చారు.

➡️