హాలీవుడ్‌ ‘డ్యూన్‌’ వెబ్‌ సిరీస్‌లో టబు

టబు ప్రతిష్టాత్మకమైన డ్యూన్‌ : ప్రాఫెసీ హాలీవుడ్‌ వెబ్‌ సిరీస్‌లో నటించనున్నారు. ‘డ్యూన్‌: ప్రాఫెసీ’లో టబు పాత్రను వెల్లడిస్తూ ఆంగ్ల మ్యాగజైన్‌ కథనాన్ని ప్రచురించింది. ‘ఇందులో సిస్టర్‌ ఫ్రాన్సెస్కా పాత్రలో టబు నటిస్తున్నారు. బలమైన, తెలివైన, ఆకర్షణీయమైన పాత్రది. అందరికీ నచ్చుతుంది. ఒకప్పుడు చక్రవర్తి ప్రేయసిగా ఉన్న ఆమె తిరిగి ప్యాలెస్‌కు రావడంతో ఇది మొదలువుతుంది’ అంటూ టబు పాత్ర గురించి మ్యాగజైన్‌ పేర్కొంది. ఈ ‘డ్యూన్‌: ప్రాఫెసీ’ సిరీస్‌ను మొదట 2019లో ప్రకటించారు. డ్యూన్‌: సిస్టర్‌హుడ్‌ పేరుతో రానున్నట్లు తెలిపారు. మనిషి మనుగడకు ముప్పు తెచ్చే శక్తులతో హర్కొనెన్‌ సిస్టర్స్‌ ఎలా పోరాడారనే అంశంపై దీని తెరకెక్కిస్తున్నారు.

➡️