‘ది 100’ ఫస్ట్‌ లుక్‌, మోషన్‌ పోస్టర్‌ లాంచ్‌

Mar 14,2024 17:12 #New Movies Updates, #released, #teaser

ఆర్కే సాగర్‌ని విక్రాంత్‌ ఐపీఎస్‌గా పరిచయం చేస్తూ ‘ది 100’ ఫస్ట్‌ లుక్‌ డ మోషన్‌ పోస్టర్‌ను మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు లాంచ్‌ చేశారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. ‘ది 100’ చిత్రం మంచి సందేశంతో చాలా అద్భుతంగా వుంది. సినిమా చూసిన తర్వాత పోలీస్‌ అధికారి అంటే సాగర్‌ లా ఫిట్‌గా హుందాగా వుండాలనిపించింది. తప్పకుండా సినిమా పెద్ద విజయం సాధిస్తుందనే విశ్వాసం వుంది అని అన్నారు. ఈ మూవీలో మిషా నారంగ్‌ కథానాయికగా నటిస్తుండగా, ధన్య బాలకష్ణ కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రముఖ టెక్నీషియన్లు ఈ సినిమాలో పని చేస్తున్నారు. శ్యామ్‌ కె నాయుడు డీవోపీ గా పని చేస్తుండగా, హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ సంగీతం అందిస్తున్నారు. అమర్‌ రెడ్డి కుడుముల ఎడిటర్‌. చిన్నా ప్రొడక్షన్‌ డిజైనర్‌. ఆర్కే సాగర్‌ ఇంటెన్స్‌ పోలీస్‌ గా కనిపించనున్న ఈ చిత్రానికి సుధీర్‌ వర్మ పేరిచర్ల డైలాగ్స్‌ రాస్తున్నారు.

➡️