‘భీమా’ నుంచి ఫస్ట్ సింగిల్ ఎదోఎదో మాయ విడుదల

Feb 10,2024 14:56 #gopichand, #New Movies Updates

మాచో స్టార్ గోపీచంద్  యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘భీమా’ మేకర్స్ ఫస్ట్ ఆఫర్ టీజర్ తో అందరినీ ఆశ్చర్యపరిచారు. ఎ హర్ష దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని  శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కెకె రాధామోహన్ లావిష్ గా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం ఫస్ట్ సింగిల్ ఎదో ఎదో మాయ సాంగ్ ని విడుదల చేశారు. టీజర్ ప్రధానంగా సినిమా బ్యాక్‌డ్రాప్‌ను, గోపీచంద్ పాత్రను టఫ్ కాప్‌గా పరిచయం చేయడంపై దృష్టి పెట్టగా, ఫస్ట్ సింగిల్ ద్వారా భీమా ప్రేమ కథను ప్రజెంట్ చేశారు.KGF, సలార్ ఫేమ్ రవి బస్రూర్ స్వరపరిచిన ఎదో ఎదో మాయ అద్భుతమైన రొమాంటిక్ నంబర్.


ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్‌ మరో కథానాయిక. స్వామి జె గౌడ సినిమాటోగ్రఫీని, సాలార్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.రమణ వంక ప్రొడక్షన్ డిజైనర్, తమ్మిరాజు ఎడిటర్. కిరణ్ ఆన్‌లైన్ ఎడిటర్, అజ్జు మహంకాళి డైలాగ్స్ అందిస్తున్నారు.  ఈ చిత్రానికి రామ్-లక్ష్మణ్, వెంకట్,  డాక్టర్ రవివర్మ యాక్షన్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు. ఇటీవల మేకర్స్అనౌన్స్ చేసినట్లుగా ‘భీమా’ మహా శివరాత్రి కానుకగా మార్చి 8న థియేటర్లలోకి రానుంది.

 

➡️