‘మస్తు షేడ్స్‌ ఉన్నారు రా’ అంటున్న అభినవ్‌

Jan 22,2024 20:25 #New Movies Updates

‘ఈ నగరానికి ఏమైంది’, ‘మీకు మాత్రమే చెబుతా’, ‘సేవ్‌ టైగర్‌’ చిత్రాల్లో కమెడియన్‌గా నటించిన అభినవ్‌ గోమఠం హీరోగా ‘మస్తు షేడ్స్‌ ఉన్నారు రా’ చిత్రం తెరకెక్కుతోంది. వైశాలి రాజ్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. కాసుల క్రియేటివ్‌ వర్క్స్‌ పతాకంపై తిరుపతి రావు ఇండ్ల దర్శకత్వంలో భవాని కాసుల, ఆర్‌.ఎం రెడ్డి, ప్రశాంత్‌.వి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వంశీ నందిపాటి ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రం టైటిల్‌ లోగోను తరుణ్‌ భాస్కర్‌తో పాటు, ఓ కాలేజీలో జరిగిన వేడుకలో అక్కడి విద్యార్థులు విడుదల చేశారు. ‘హాస్యనటుడిగా, సహాయ నటుడిగా అందరి ప్రశంసలు అందుకున్న అభినవ్‌లోని కొత్త కోణాన్ని, నటుడిలోని మరో కోణాన్ని ఈ చిత్రంలో చూస్తారు. కొత్తదనంతో కూడిన ఈ చిత్రం తప్పకుండా అందర్ని అలరిస్తుందనే నమ్మకం వుంద’ని లోగా ఆవిష్కరణ సందర్భంగా తరుణ్‌ భాస్కర్‌ మాట్లాడారు. ఫిబ్రవరి ద్వితియార్థంలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నారు.

➡️