‘మేకప్‌ మ్యాన్‌’ సినిమా ప్రారంభం

Apr 13,2024 19:25 #movie, #srikanth avuturi

అభిరామ్‌ మూవీస్‌ బ్యానర్‌పై సీనియర్‌ మేకప్‌ మ్యాన్‌ కుమార్‌ మెట్టుపల్లి నిర్మాతగా, దివాకర్‌ యడ్ల దర్శకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘మేకప్‌ మ్యాన్‌’. ధర్మవరపు సుబ్రహ్మణ్యం మేనల్లుడు శ్రీకాంత్‌ అవుటూరి ఈ చిత్రంతో హీరోగా పరిచయమవుతున్నారు. పోలూరు ఘటిక చలం డైలాగులు, ఎంఎం శ్రీలేఖ సంగీతం అందిస్తున్నారు. హైదరాబాద్‌లోని ఫిల్మ్‌ ఛాంబర్‌ కార్యాలయంలో ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం శనివారం జరిగింది. దర్శకుడు రవికుమార్‌ చౌదరి, నిర్మాతలు లయన్‌ సాయి వెంకట్‌, భరత్‌ పారేపల్లి హాజరయ్యారు. రవిచౌదరి క్లాప్‌కొట్టగా, సాయి వెంకట్‌ కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు. భరత్‌ పారేపల్లి తొలి షాట్‌కు గౌరవ దర్శకత్వం వహించారు.

➡️