శ్రీ మఠంలో బుల్లితెర నటుడు రాజు

May 12,2024 14:27 #temple, #TV actor Raju, #visited

ప్రజాశక్తి-మంత్రాలయం (కర్నూలు) : ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమెన మంత్రాలయంలో కొలువైన రాఘవేంద్రస్వామిని బుల్లితెర నటుడు యశ్వంత్‌ గౌడ్‌ (రాజు) కుటుంబ సమేతంగా ఆదివారం దర్శించుకున్నారు. జీ తెలుగు ఛానెల్‌ లో రాత్రి 9.30 గంటలకు వచ్చే అమ్మాయిగారు సీనియల్‌ లో రాజు గా యశ్వంత్‌ నటించారు. దర్శనార్థం ఆలయం చేరుకున్నవారు గ్రామ దేవత మంచాలమ్మను రాఘవేంద్రస్వామి మూల బఅందావనాన్ని దర్శించుకున్నారు. అనంతరం శ్రీ మఠంలో నిర్వహించు భోజనశాలలో ప్రసాదం స్వీకరించారు. ఈ సందర్భంగా బుల్లితెర నటుడు రాజుతో అభిమానులు ఫోటోలకు సెల్ఫీలకు ఫోజులిచ్చారు.

➡️