విజయ్ దేవరకొండ కొత్త ప్రాజెక్టు

May 9,2024 19:20 #movie, #vijayadevarakonda

హీరో విజయ్ దేవరకొండ మరో కొత్త సినిమాలో నటించబోతున్నారు. టాక్సీవాలా డైరెక్టర్‌ రాహుల్‌ సంకృత్యన్‌తో మరోసారి కలిసి పని చేయనున్నారు. ఈ మేరకు విజయ్ దేవరకొండ, రాహుల్‌, మైత్రీ మూవీ మేకర్స్‌ కాంబోలో క్రేజీ ప్రాజెక్ట్‌ వీడీ 14ను ప్రకటించారు. గురువారం నాడు విజరు దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రాజెక్ట్‌ ప్రకటించారు. పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ కాన్సెప్ట్‌ పోస్టర్‌ రిలీజ్‌ చేశారు. ఈ పోస్టర్‌లో బీటలు వారిన పంట పొలాల్లో రాతిపై చెక్కిన వీరుడి విగ్రహం ఉంది. దానిపై ది లెజెండ్‌ ఆఫ్‌ ది కర్స్డ్‌ ల్యాండ్‌ అని రాసి ఉంది. ఆయన జీవిత కాలం 1854 నుంచి 1878గా పేర్కొన్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు.

➡️