జూన్‌లో ‘యక్షిణి’ వచ్చేస్తోంది!

May 22,2024 19:30 #manchu lakshmi, #movie

ఆర్కా మీడియా వర్క్స్‌, డిస్నీ ఫ్లస్‌ హాట్‌ స్టార్‌ ది సూపర్‌ హిట్‌ కాంబినేషన్‌లో ‘యక్షిణి’ మరో ఆసక్తికర వెబ్‌ సిరీస్‌ ప్రేక్షకులను అలరించనుంది. ఈ సంస్థల కలయికలో గతంలో పరంపర, పరంపర 2 వెబ్‌ సిరీస్‌లు వచ్చిన విషయం తెలిసిందే. యక్షిణి వెబ్‌ సిరీస్‌ను శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మిస్తున్నారు. వేదిక, మంచు లక్ష్మి, రాహుల్‌ విజయ్, అజయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. దర్శకత్వం తేజ మార్ని. జూన్‌లో తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీలో ‘యక్షిణి’ వెబ్‌ సిరీస్‌ స్ట్రీమింగ్‌కు రాబోతోంది.

➡️