బూడిద గుమ్మడి .. బోలెడు ప్రయోజనాలు..

Dec 12,2023 10:54 #Jeevana Stories

బూడిద గుమ్మడికాయను తినడానికి చాలామంది ఇష్టపడరు. కాని బూడిద గుమ్మడికాయలో పోషకాలు ఎక్కువ. కేలరీలు తక్కువ. దీనిలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. దోసకాయ రుచి లాగే ఉండే ఈ గుమ్మడికాయ ఉపయోగాలు బోలెడు.

  • నీటి శాతం ఎక్కువగా ఉండే బూడిద గుమ్మడికాయలను స్మూతీలు, జ్యూస్‌లు, సలాడ్‌ల రూపంలో ఆహారంలో చేర్చుకోవచ్చు.
  • ఇందులో ఫైబర్‌ పుష్కలంగా ఉంటుంది. జింక్‌, ఐరన్‌, మెగ్నీషియం, కాల్షియం, ఫాస్ఫరస్‌, కాపర్‌, మాంగనీస్‌ వంటి ఖనిజాలు ఉంటాయి. విటమిన్‌ సి, నియాసిన్‌, రిబోఫ్లేవిన్‌, థయామిన్‌ వంటి విటమిన్లు కూడా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇంకా ఆల్కలాయిడ్లు, టానిన్లు, గ్లైకోసైడ్లు, ఫినాల్స్‌, ఫ్లేవనాయిడ్లు వంటి ఫైటోకెమికల్స్‌ కూడా అధికంగా ఉంటాయి.
  • ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల శరీరంలో చెడు కొవ్వు చేరనీయకుండా కాపాడుతుంది.శ్రీ తరచూ తినడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. దీనిలో ఉండే ఫోలేట్‌ పుట్టుకతో వచ్చే లోపాలను నివారించడానికి కూడా సహాయపడుతుంది.
  • ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబయల్‌ లక్షణాలు రోగనిరోధక శక్తిని పెంచేందుకు ఎంతగానో సహాయపడతాయి.
  • మధుమేహ బాధితుల శరీరంలోని చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. శ్రీ క్షయ, రక్తహీనతను తగ్గించడానికి సహాయపడుతుంది.
  • పేగుల కదలికలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఆంత్రము, చిన్నప్రేవులు లేక పెద్ద ప్రేవుల్లోని అసౌకర్యాన్ని తగ్గిస్తాయి.
  • పీచు, పొటాషియం ఉండటం వల్ల అధిక రక్తపోటును నిరోధిస్తుంది. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటాన్ని కూడా నిరోధిస్తుంది. కంటి చూపు మెరుగవడానికి తోడ్పడుతుంది.
  • ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్స్‌, విటమిన్‌ సి కాలేయ ఆరోగ్యాన్ని కాపాడతాయి.
  • జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. శ్రీ అయితే జలుబు, ఆస్తమా, సైనసైటిస్‌ సమస్యలు ఉన్నవారు వీటిని తీసుకోకపోవడమే మంచిది. ఎందుకంటే దీనిలో శరీరాన్ని చల్లబరిచే గుణాలుంటాయి.
➡️