దోసకాయల్లో అధిక పోషకాలు

Dec 18,2023 10:30 #feature

దోసకాయల్లో అధిక పోషకాలు ఉంటాయి. కూరగాయ గాను ఫలం గానూ దీనికి వాడుతుంటాం. ఎక్కువ పోషకాలు, తక్కువ కేలరీలు, ఎక్కువ శాతం నీళ్లు, ఎక్కువ పైబర్‌ అన్నీ కలిపి ఉన్న దోసకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బరువు తగ్గడానికి దోసకాయ చాలా సాయం చేస్తుంది. 300 గ్రాముల దోసకాయలో 11 ఔన్సుల కేలరీలు మాత్రమే ఉంటాయి. దోసకాయలను తింటే శరీరం బరువెక్కకుండా తేలికగా ఉంటుంది. శరీరంలో నీటి శాతాన్ని పెంచి డీ హైడ్రేషన్‌ను గురికాకుండా చాలా ఉపయోగపడతాయి. వీటిలో నీరు ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలోని మలినాలన్నీ బయటకు పోతాయి. శరీరంలో సరైన పాళ్లలో నీటిశాతం ఉంటే జీవక్రియ పనితీరు మెరుగు అవుతుంది. శరీరంలో చక్కెర శాతాన్ని తగ్గిస్తుంది. తక్కువ కేలరీలు, ఎక్కువ నీరు రక్తంలోని చక్కెర శాతాన్ని తగ్గించి ఆరోగ్యంగా ఉంచుతుంది. అధిక శాతం పోషక విలువలున్న దోసకాయలను దాని తోలు తీయకుండానే తింటే ఎంతో మంచిది. తోలు తీసేసి తినటం వల్ల అందులో ఉండే ఫైబర్‌ శాతం తగ్గిపోతుంది. చలికాలంలో చర్మం పొడిబారకుండా ఉండేందుకు దోసకాయ ఉపయోగపడుతుంది. చర్మంపై మచ్చలు పోవటానికి దోసకాయను తేనెతో కలిపి ముఖానికి రాసుకోవాలి.

➡️