వానలు కురవాలి

May 13,2024 04:35 #jeevana

వానలు కురవాలి
చిగురులు వేయాలి
ఎండలు తగ్గాలి
గాలులు వీయాలి

నేలమ్మ తడవాలి
చల్లగా వుండాలి
చెట్లు చిగురించాలి
పచ్చదనం రావాలి

విత్తలు నాటాలి
మొక్కలు మొలవాలి
వనరులు పెరగాలి
భూతాపం పోవాలి

పచ్చపచ్చని నేలంతా
ఎంతో చక్కగా వుండాలి
వేడి గాలులు తగ్గాలి
చల్లదనం పెరగాలి

వర్షాలు బాగా కురవాలి
భూమి తాపం తీరాలి
చెట్లు ఏపుగా పెరగాలి
ఎంతో హాయిగా వుండాలి
– దేవాంగం జగదీశ్వర,
96184 36520.

➡️