మధురమైన రంగులు

Apr 30,2024 05:30 #feachers, #jeevana, #Kavitha

రంగులు రంగులు
ఎన్నో రంగులు
ఆకుపచ్చ నాకెంతో ఇష్టం
ఆకుపచ్చని జామ ఆరోగ్యానిచ్చు!

రంగులు రంగులు
ఎన్నో రంగులు
ఎరుపంటే నాకెంతో ఇష్టం
ఎర్రని రేగుపండు ఎంతో రుచి!

రంగులు రంగులు
ఎన్నో రంగులు
పసుపు రంగు నాకెంతో ఇష్టం
పసుపురంగు మామిడి ఎంతో మధురం!

రంగులు రంగులు
ఎన్నో రంగులు
నారింజ రంగు నాకెంతో ఇష్టం
నారింజరంగు సంత్రాలెంతో తియ్యన!

రంగులు రంగులు
ఎన్నో రంగులు
ఉదా రంగంటే నాకెంతో ఇష్టం
ఉదారంగు నేరేడు వంటికెంతో మేలు!
రంగులు రంగులు
ఎన్నో రంగులు
గోధుమ రంగంటే నాకెంతో ఇష్టం
గోధుమ రంగు సపోట ఎంతో కమ్మన!

రంగులు రంగులు
ఎన్నో రంగులు
తెలుపు రంగంటే నాకిష్టం
తెల్లని తాటిముంజలెంతో చల్లన!

– డా.నీరజ అమరవాది,
9849160055.

➡️