గొంతు నొప్పి తగ్గాలంటే …

Dec 18,2023 10:33 #feature

చలికాలంలో గొంతు నొప్పి, జలుబు, దగ్గు వేధిస్తుంటాయి. గొంతు నొప్పిని తగ్గించడానికి ఇంటి చిట్కాలను వాడితే మంచి ఫలితం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

  • గొంతు నొప్పి ఉన్నప్పుడు గోరువెచ్చని నీరు మాత్రమే తాగాలి. అలా చెయ్యడం వల్ల కఫం తగ్గుతుంది.
  • గోరువెచ్చని నీటిలో వెనిగర్‌ వేసి గార్గింగ్‌ చేస్తే కూడా గొంతు నొప్పి, ఇన్ఫెక్షన్‌ త్వరగా నయమవుతుంది. వెనిగర్‌ లేకపోయినా, గోరువెచ్చని నీటిలో ఉప్పు వేసి కూడా గార్గింగ్‌ చేసుకోవచ్చు.
  • నీటిలో 4, 5 మిరియాలు, కొన్ని తులసి ఆకులను వేసి మరిగించాలి. ఈ కషాయాన్ని రాత్రి నిద్రపోయేటప్పుడు తాగితే బాగా ప్రయోజనకరంగా ఉంటుంది. గొంతునొప్పి త్వరగా నయమవుతుంది.
  • మిరియాల పొడిలో కొంచెం నెయ్యి కలిపి తింటే ప్రయోజనకరంగా ఉంటుంది.
  • నల్ల మిరియాలతోపాటు బాదంపప్పును కలిపి నూరి కొంచెం నీటిలో కలిపి సేవించడం వల్ల కూడా గొంతు వ్యాధులు నయమవుతాయి.
  • ఏమైనా మందులు వాడాల్సి వచ్చినప్పుడు డాక్టర్‌ను సంప్రదించి తగు జాగ్రత్తలను తీసుకోవడం మంచిది.
  • ఆహార పదార్థాలు వేడిగా ఉన్నప్పుడే తినాలి.
➡️