ఇద్దరు స్నేహితులు

Jun 10,2024 05:25 #feachers, #jeevana, #katha

రాజు, రాము ఇద్దరూ స్నేహితులు. వారిద్దరికీ క్రికెట్‌ అంటే చాలా ఇష్టం. రాజు బాగా చదువుతాడు. రాము చదువుని కొంచెం నిర్లక్ష్యం చేస్తాడు. పరీక్షలప్పుడు కూడా చదువుకోకుండా క్రికెట్‌ ఆడేవాడు. వాళ్ల నాన్నకి ఇది నచ్చేది కాదు. ఒకసారి పరీక్షల్లో రాముకి బాగా తక్కువ మార్కులు వచ్చాయి. రాజు ఫస్ట్‌ క్లాసులో పాసయ్యాడు. రాము క్రికెట్‌ ఆడుతూ చదువును నిర్లక్ష్యం చేశాడని వాళ్ల నాన్నకి తెలిసి బాగా తిట్టాడు. తరువాత మాస్టారు, రాముకు క్రికెట్లో ఆసక్తి ఉంది కాబట్టి ఆటలో శిక్షణ ఇప్పించమని సలహా ఇచ్చారు. దీంతో, రాము వాళ్ల నాన్న, మంచి కోచ్‌ దగ్గర రాముని చేర్చాడు.
శిక్షణలో రాణించిన రాము చిన్న చిన్న మ్యాచ్‌ల నుండి పెద్ద పెద్ద మ్యాచులు ఆడే స్థాయికి ఎదిగాడు. అదే సమయంలో రాజు బాగా చదువుకుని ఉద్యోగంలో స్థిరపడ్డాడు. ఒకసారి పెద్ద స్టేడియంలో క్రికెట్‌ మ్యాచ్‌ చూడడానికి రాజు అక్కడికి వెళ్లాడు. అక్కడ టీమ్‌కి నేతృత్వం వహిస్తున్న రాముని చూసి చాలా సంతోషించాడు. తన స్నేహితుడు ఎంతో పెద్ద స్థాయికి వెళ్లాడని చాలా గర్వపడ్డాడు. ఆట ముగిశాక రామునికలిసి అభినందనలు చెప్పాడు. చాలా రోజుల తరువాత కలిసిన స్నేహితులిద్దరూ చిన్న నాటి ముచ్చట్లు చెప్పుకున్నారు.

– బోయిని నందిని, 9వ తరగతి,
జక్కాపూర్‌, సిద్దిపేట జిల్లా,
99590 07914.

➡️