తక్షణమే రోడ్ల మరమ్మతులు -ఆర్‌అండ్‌బిశాఖ మంత్రి బిసి జనార్ధన్‌రెడ్డి

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :గత ఐదేళ్లలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురై పూర్తిగా దెబ్బతిన్న రోడ్లన్నిటికీ తక్షణం మరమ్మతు పనులు చేపట్టాలని రోడ్లు, భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలశాఖ మంత్రి బిసి జనార్ధన్‌రెడ్డి ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో రోడ్లు, భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలశాఖ మంత్రిగా ఆయన బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంట్రాక్టర్లకు గత ప్రభుత్వం రూ.2,261 కోట్ల బకాయిలు పెట్టిందని విమర్శించారు. కాంట్రాక్టర్లకు సకాలంలో బిల్లులు చెల్లించనందునే పనులు చేసేందుకు టెండర్లను దక్కించుకున్న కాంట్రాక్టర్లు కూడా ముందుకు రావడం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పెట్టుబడులు, మౌలిక సదుపాయాలశాఖ కార్యదర్శి యువరాజ్‌, ఆర్‌అండ్‌బి ఇఎన్‌సిలు కె నయీముల్లా, వేణుగోపాల్‌ రెడ్డి, సిఇలు శ్రీనివాసులు రెడ్డి, రామచంద్ర, వెంకటేశ్వరరావు, సుకన్య, బుచ్చిరాజు తదితరులు పాల్గొన్నారు.

➡️