వేరుశెనగ పప్పులతో ఎంతోమేలు

Jan 11,2024 07:34 #feature, #jeevana

సాధారణంగా మనం తీసుకొనే ఆహారంలో వేరుశెనగలు (పల్లీలు) బలమైన ఆహారం. నూనెశాతం ఎక్కువగా ఉంటాయి. శాఖాహారంగా చౌకగా మాంసకృత్తులు వీటిలో దొరుకుతాయి. కోడి గుడ్డులో కంటే రెండున్నర రెట్లు ఎక్కువగానే మాంసకృత్తులు ఉంటాయి. 70 శాతం సాచ్యురేటెడ్‌, 15 శాతం పోలి అన్సాచ్యురేటెడ్‌, 15 శాతం మోనో ఆన్సాచ్యురేటెడ్‌ ఉన్నాయి. మోనో ఆన్‌ సాచ్యురేటెడ్‌ కొవ్వులే శరీరానికి మేలు చేస్తాయి. ఇంట్లో ఉండే వేరుశనగ పప్పు ప్రతి రోజూ గుప్పెడు తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. కాబట్టి ప్రతిరోజూ ఆహారంలో వీటిని తీసుకుంటే మంచిది. ప్రతి 100 గ్రాముల వేరుశెనగల్లో 8 గ్రాముల విటమిన్‌ ‘ఇ’ ఉంటుంది. నియాసిన్‌, ప్రోటీన్‌, మాంగనీసు పోషకాలు అధికం. అమినో యాసిడ్స్‌ కూడా ఎక్కువ. ఇవి పిత్తాశయంలో రాళ్ళు ఏర్పడకుండా నివారిస్తుంది. అమినో యాసిడ్స్‌ మెదుడు నాడీకణాలకు సంబంధించిన కెరోటినిన్‌ ఉత్పత్తి చేస్తుంది. ఇది మెదడు ఒత్తిడికి గురికాకుండా సహాయపడుతుంది. మెదడు కణాలు దెబ్బతినకుండా రక్షణ కల్పించి జ్ఞాపకశక్తి మెరుగుపరుస్తుంది. ఫ్యాట్‌ శరీరానికి శక్తిగా మార్పు చెందుతుంది. శరీరంలో జీవక్రియలన్నీ ఆరోగ్యంగా జరగడానికి ఇవి సహాయపడతాయి. క్యాల్షియం, విటమిన్‌-డి లు ఎముకపుష్టికి దోహదపడతాయి. రెబోఫ్లేవిన్‌, నియాసిన్‌, థయామిన్‌, విటమిన్‌ బి6, ఫొలేట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలోని ఫ్రీరాడికల్స్‌ చర్యలను నిరోధిస్తుంది. చర్మ ఇన్ఫెక్షన్లు రాకుండా దోహదపడతాయి. రోజూ గుప్పెడు వేరుశెనగలు లేదా పది గ్రాముల నట్స్‌, డ్రైప్రూట్స్‌ తింటే ఆరోగ్యం మెరుగుపడుతుందని పరిశోధకులు చెబుతున్నారు.

➡️