Women’s Health : మహిళలు ఆరోగ్యంగా ఉండాలంటే..?

Mar 7,2024 15:02 #health, #womens health

ఇంటర్నెట్‌డెస్క్‌ : మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబంతోపాటు, సమాజం కూడా బాగుంటుంది. కుటుంబంలో ఎంతో కీలకపాత్ర వహించే మహిళలు మాత్రం తమ ఆరోగ్యంపట్ల నిర్లక్ష్యం వహిస్తారు. దీంతో చిన్న వయసులోనే పలు అనారోగ్య సమస్యల్ని ఎదుర్కొంటారు. మహిళల ఆరోగ్యంపై వైద్యులు చెప్పే సలహాలేంటో తెలుసుకుందామా..?!

– బిడ్డకు మరో బిడ్డకు మధ్య గ్యాప్‌ లేకుండా వెంటవెంటనే ప్రసవాల వల్ల మహిళలు శారీరక, మానసిక సమస్యల్ని ఎదుర్కొంటారు. ముఖ్యంగా గర్భాశయం దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బిడ్డకు బిడ్డకు మధ్య గ్యాప్‌ కచ్చితంగా ఉండాలి. లేకపోతే మహిళలు అధిక రక్తస్రావాల వల్ల చాలా బలహీనులవుతారని వైద్యులు అంటున్నారు. అందుకే మహిళలు గర్భాధారణ సమయంలో పోషకాహారం తీసుకోవాలి. ప్రసవానంతరం కూడా వైద్యుల్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి. గర్భధారణ సమయంలోనూ, ప్రసవానంతరం కూడా కుటుంబ సభ్యులు ఆమె ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. ఆమెకు అన్నివిధాలుగా కుటుంబ సభ్యులు సహకరించాలి అని వైద్యులు సూచిస్తున్నారు.

– మహిళలు భర్త, పిల్లల ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధపెడతారు కానీ.. తన ఆరోగ్యం గురించి ఏమాత్రం పట్టించుకోరు. దీంతో రోగనిరోధక శక్తి తగ్గి తరచూ అనారోగ్యంపాలవుతారు. అందుకే రోగని రోధకశక్తి పెంచేటటువంటి ఆహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలి.

– మహిళలు మంచి ఆహారం తీసుకోవడం వల్ల రుతుక్రమ సమస్యలను ఎదుర్కొగలుగుతారు. లేకపోతే మానసిక కుంగుబాటుకు గుర్యే ప్రమాదమముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

– ఆడవాళ్లు రోజూ ఇంటెడు చాకిరీ చేసేటప్పటికీ అలసిపోవడం ఖాయం. కేవలం ఈ కారణాల వల్లే ఆడవాళ్లు శారీరక వ్యాయామాలకు దూరమవుతారు. శారీరక వ్యాయామాలు చేయకపోవడం వల్లే హార్మోన్ల సమస్యలు, అధిక బరువు సమస్యల్ని ఎదుర్కొంటారు. ఈ సమస్యల్ని అధిగమించాలంటే వ్యాయామం తప్పనిసరి అని వైద్యులు చెబుతున్నారు.

➡️