కోర్బా ఎన్నికల బరిలో వ్యవసాయ కూలీ

– జీరో బ్యాలెన్స్‌ బ్యాంక్‌ ఖాతా
రాయ్ పూర్‌: ఛత్తీస్‌గఢ్‌ భేద్రపాణి గ్రామానికి చెందిన శాంతి బాయి మారావి అనే వ్యవసాయ కూలి కోర్బా లోక్‌సభ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. నామినేషన్‌ దాఖలు సమయంలో తన ఆస్తుల వివరాల్లో జీరో బ్యాంక్‌ బ్యాలెన్స్‌గా నమోదు చేశారు. దీంతో ఆమెకు జీరో బ్యాలెన్స్‌ అనే పేరు వచ్చింది. తన తోటి వ్యవసాయ కూలీల ఆర్థిక సహకారంతో డిపాజిట్‌ మొత్తాన్నీ కట్టానని శాంతి చెబుతున్నారు. రోడ్లు, సరైన రవాణా సదుపాయం లేక తమ ప్రాంతం వాళ్లు ఇబ్బందులు పడుతున్నారని ఏ రాజకీయ పార్టీ వారి సమస్యలను వినకపోవడంతో తానే ఎన్నికల్లో పోటీకి దిగానని చెప్పారు శాంతి బాయి. డబ్బుతో పనిలేకుండా స్థానిక సమస్యలపై ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేయొచ్చనడానికి శాంతి బాయిని ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. కోర్బా నియోజకవర్గానికి మే 7న (మంగళవారం) పోలింగ్‌ జరిగింది.

➡️