దేశద్రోహులుగా పిలుస్తారని గాంధీ, నెహ్రులు ఊహించలేదు : ప్రియాంక

May 7,2024 22:53 #PRIYANKA, #speech

రాయ్ బరేలీ : జాతిపిత మహాత్మా గాంధీ, జవహర్‌లాల్‌ నెహ్రూ తమను దేశద్రోహులుగా పిలుస్తారని ఊహించలేదని కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ అన్నారు. రారుబరేలీలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ.. ‘గాంధీ, నెహ్రూలిద్దరూ దేశ ప్రజల హక్కులను బలోపేతం చేసేందుకు ఉద్యమాలు చేశారు. అయితే దేశంలో తమను దేశ ద్రోహులుగా పిలిచే ప్రభుత్వం వస్తుందని వారు ఊహించలేదు.’ అని ఆమె అన్నారు. ఈ ప్రచారంలో ప్రియాంక రైతుల నిరసనల్ని కూడా ప్రస్తావించారు. బ్రిటీష్‌ రాజ్‌ సమయంలో జరిగిన రైతు నిరసనల్లో మోతీలాల్‌ నెహ్రూ, గాంధీలను మొదటిసారి అరెస్ట్‌ చేశారని గుర్తు చేశారు. అప్పటి నుంచి రారుబరేలీలో ఓవైపు ప్రజాస్వామ్యం, మరోవైపు ఉగ్రవాదం తరహా రాజకీయాలు ఉన్నాయి. ఈ పోరాటంలో ఎల్లప్పుడూ సత్యం, ప్రజాస్వామ్య సూత్రాలకు మీరు విజయాన్ని అందించారని కాంగ్రెస్‌ కార్యకర్తలనుద్దేశించి అన్నారు. కాగా రారుబరేలీ నుంచి రాహుల్‌గాంధీ పోటీ చేస్తున్నారు. ఇక్కడ మే 20న ఎన్నికలు జరగనున్నాయి.

➡️