రెండో దశ అభ్యర్థుల్లో ధనవంతులెవరంటే.?!

Apr 25,2024 23:08 #Karnataka

రెండో దశ పోలింగ్‌ శుక్రవారం (ఏప్రిల్‌ 26) రోజున జరగనుంది. ఈ దశలో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఇద్దరు, ఒక బిజెపి అభ్యర్థి అందరిలోకి అత్యధిక ధనవంతులుగా అగ్రస్థానంలో నిలిచారు. నామినేషన్లతోపాటు అభ్యర్థులు ఇసికి దాఖలు చేసిన అఫిడవిట్‌లను పరిశీలించిన అనంతరం అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడిఆర్‌) రూపొందిం, ఈ జాబితా ఆధారంగా 33 శాతం మంది కోటీశ్వరులుగా ఉన్నారు.

వెంకట రమణే గౌడ : కర్ణాటక మండువ స్థానం నుంచి కాంగ్రెస్‌ నుంచి పోటీకి దిగారు. ఇతనికి రూ. 622 కోట్లకు పైగా ఆస్తులున్నాయి.

డి.కె సురేష్‌ : కర్ణాటక ఉపముఖ్యమంత్రి డి.కె శివకుమార్‌ సోదరుడు డికె సురేష్‌. బెంగళూరు రూరల్‌ స్థానం నుంచి పోటీకి దిగారు. ఆయన ఆస్తులు 593 కోట్ల రూపాయలు. 2019 ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికలకు దాదాపు ఈయన ఆస్తులు 75 శాతం పెరిగాయి.

హేమమాలిని : ప్రముఖ బాలీవుడ్‌ నటి హేమామాలిని యుపి రాష్ట్రం మధుర సిట్టింగ్‌ ఎంపి. ఈమె ఈ స్థానం నుంచి రెండుసార్లు బిజెపి తరఫున గెలిచారు. ఇప్పుడు వరుసగా మూడోసారి బరిలో నిలిచారు. ఈమెకు రూ. 278 కోట్ల ఆస్తులు ఉన్నాయి. మధ్యప్రదేశ్‌లో హోషంగాబాద్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి సంజరుశర్మ రూ. 233 కోట్లు. కర్ణాటక స్టేట్‌ మాండ్యలో జెడిఎస్‌ ఛీప్‌ కుమారస్వామికి రూ. 217 కోట్లు. యూపీలో అమ్రోహా బిజెపి అభ్యర్థి కన్వర్‌ సింగ్‌ తన్వర్‌ రూ. 215 కోట్ల ఆస్తులున్నాయి.

➡️