Accident: కర్ణాటకలో ఘోరం

-ఆగివున్న ట్రక్‌ను డీకొన్న మినీ బస్‌
-13 మంది మృతి
బెంగళూరు : నిలిచి ఉన్న ట్రక్‌ను వెనకు నుంచి ఒక మినీ బస్‌ ఢకొీన్న ప్రమాదంలో 13 మంది మరణించగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం శుక్రవారం తెల్లవారు జామున 3:45 గంటలకు కర్ణాటకలో జరిగింది. హవేరి జిల్లాలో పూణేాబెంగళూరు జాతీయ రహదారిపై గుండెనహల్లి క్రాసింగ్‌కు సమీపంలో ఈ ప్రమాదం జరగ్గా, ఈ సమయంలో మినీ బస్సులో 17 మంది ఉన్నారు. వీరంతా శివమొగ్గ జిల్లాకు చెందిన వారు. బెల్గావి జిల్లాలోని ఒక ఆలయాన్ని సందర్శించి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన నలుగురిని సమీప ఆసుపత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. డ్రైవర్‌ నిద్రమత్తే ఈ ప్రమాదానికి దారితీసి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. హవేరి జిల్లా ఎస్‌పి అన్షు కుమార్‌ శ్రీవాత్సవ మాట్లాడుతూ బాధితులంతా చించోలి మాయమ్మ దేవస్థానాన్ని దర్శించుకుని శివమొగ్గ జిల్లాలోని స్వగ్రామం యెమెహత్తికి తిరిగి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు.

➡️