జడేజా ఆల్‌రౌండ్‌ షో

May 6,2024 08:10 #2024 ipl, #Cricket, #IPL, #Sports
  • బౌలింగ్‌లో మెరిసిన తుషార్‌, ఆర్ష్‌దీప్‌
  • పంజాబ్‌ కింగ్స్‌పై 28పరుగుల తేడాతో చెన్నై గెలుపు

చెన్నై సూపర్‌కింగ్స్‌ అదరహో. గత నాలుగు మ్యాచుల్లో మూడు పరాజయాలు చవిచూసిన సూపర్‌కింగ్స్‌ ధర్మశాలలో గెలుపు బాట పట్టింది. పంజాబ్‌ కింగ్స్‌ను చిత్తు చేసి ఏకపక్ష విజయం సాధించింది. 168 పరుగుల ఊరించే ఛేదనలో జడేజా, తుషార్‌, సిమ్రన్‌జిత్‌ మ్యాజిక్‌తో పంజాబ్‌ బ్యాటర్లు చేతులెత్తేశారు. చెన్నై సూపర్‌కింగ్స్‌ ఏడో విజయం ఖాతాలో వేసుకోగా.. పంజాబ్‌ కింగ్స్‌ ఏడో ఓటమిని మూటగట్టుకుంది.
ధర్మశాల : రవీంద్ర జడేజా (43; 26బంతుల్లో 3ఫోర్లు, 2సిక్సర్లు) ధనా ధన్‌ బ్యాటింగ్‌కి తోడు బౌలింగ్‌లో(3/20) ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో మాయజాలం చేశాడు. జడేజా మ్యాజిక్‌తో పంజాబ్‌ కింగ్స్‌ చేతిలో వరుస ఐదు ఓటములకు చెన్నై సూపర్‌కింగ్స్‌ చెక్‌ పెట్టింది. ధర్మశాలలో పంజాబ్‌ కింగ్స్‌ను చిత్తు చేసిన సూపర్‌కింగ్స్‌ 28 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో టాప్‌-3లోకి చెన్నై ఎగబాకింది. 168 పరుగుల ఛేదనలో పంజాబ్‌ కింగ్స్‌ చతికిల పడింది. ఓపెనర్‌ ప్రభుసిమ్రన్‌ సింగ్‌(30; 23బంతుల్లో 2ఫోర్లు, 2సిక్సర్లు), శశాంక్‌ సింగ్‌ (27; 20బంతుల్లో 4ఫోర్లు) మినహా మిగిలిన బ్యాటర్లందరూ విఫలమయ్యారు. జానీ బెయిర్‌స్టో(7), రూసో(0), కరన్‌(7), జితేశ్‌(0), ఆషుతోశ్‌(3) విఫలమయ్యారు. చెన్నై బౌలర్లు జడేజా, తుషార్‌ (2/35), సిమ్రన్‌జిత్‌ సింగ్‌(2/16) బౌలింగ్‌లో మెరిసారు. అంతకు ముందు తొలిగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై జట్టులో రవీంద్ర జడేజాకు తోడు కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ (32; 21బంతుల్లో 4ఫోర్లు, సిక్సర్‌), మిచెల్‌ (30; 19బంతుల్లో 2ఫోర్లు, సిక్సర్‌) బ్యాటింగ్‌లో రాణించారు. ఎం.ఎస్‌ ధోని (0) గోల్డెన్‌ డక్‌గా వెనుదిరిగాడు. దీంతో చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9వికెట్ల నష్టానికి 167పరుగులు చేసింది. పంజాబ్‌ బౌలర్లలో హర్షల్‌ పటేల్‌ (3/24), రాహుల్‌ చాహర్‌ (3/23), ఆర్ష్‌దీప్‌ సింగ్‌ (2/42) రాణించారు.
జడేజా షో : టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు వచ్చిన సూపర్‌కింగ్స్‌కు ఆశించిన ఆరంభం దక్కలేదు. అజింక్య రహానె (9) మరోసారి నిరాశపరిచాడు. కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ (32), డార్లీ మిచెల్‌ (30) రెండో వికెట్‌కు కీలక భాగస్వామ్యం నమోదు చేశారు. పంజాబ్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేసినా క్రమం తప్పకుండా బౌండరీలు బాదారు. శివం దూబె (0), మోయిన్‌ అలీ (17) నిరాశపరచటంతో చెన్నై 101/5తో కష్టాల్లో కూరుకుంది. ఈ సమయంలో రవీంద్ర జడేజా (43) ఆదుకున్నాడు. మూడు ఫోర్లు, రెండు సిక్సర్లతో మెరిశాడు. మిచెల్‌ శాంట్నర్‌ (11), శార్దుల్‌ ఠాకూర్‌ (17) తోడుగా డెత్‌ ఓవర్లలో రాణించాడు. ఎం.ఎస్‌ ధోని (0) తొలి బంతికే నిష్క్రమించగా అభిమానులు నిరాశకు లోనయ్యారు. పంజాబ్‌ కింగ్స్‌ బౌలర్లు హర్షల్‌ పటేల్‌, రాహుల్‌ చాహర్‌, అర్షదీప్‌ సింగ్‌లు సూపర్‌కింగ్స్‌ బ్యాటర్లను సమర్థవంతంగా నిలువరించారు. చెన్నై సూపర్‌కింగ్స్‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 167 పరుగులే చేసింది.

స్కోర్‌బోర్డు…
చెన్నై సూపర్‌కింగ్స్‌ ఇన్నింగ్స్‌: రహానే (సి)రబడా (బి)ఆర్ష్‌దీప్‌ సింగ్‌ 9, గైక్వాడ్‌ (సి)జితేశ్‌ శర్మ (బి)రాహుల్‌ చాహర్‌ 32, మిఛెల్‌ (ఎల్‌బి)హర్షల్‌ పటేల్‌ 30, శివమ్‌ దూబే (సి)జితేశ్‌ శర్మ (బి)రాహుల్‌ చాహర్‌ 0, మొయిన్‌ అలీ (సి)బెయిర్‌స్టో (బి)సామ్‌ కర్రన్‌ 17, జడేజా (సి)సామ్‌ కర్రన్‌ (బి)ఆర్ష్‌దీప్‌ సింగ్‌ 43, సాంట్నర్‌ (సి)సామ్‌ కర్రన్‌ (బి)రాహుల్‌ చాహర్‌ 11, శార్దూల్‌ ఠాకూర్‌ (బి)హర్షల్‌ పటేల్‌ 0, తుషార్‌ దేశ్‌పాండే (నాటౌట్‌) 0, రిచర్డు గ్లీసన్‌ (నాటౌట్‌) 2, దనం 6. (20ఓవర్లలో 9వికెట్ల నష్టానికి) 167పరుగులు.
వికెట్ల పతనం: 1/12, 2/69, 3/69, 4/75, 5/101, 6/122, 7/150, 8/150, 9/164
బౌలింగ్‌: రబడా 3-0-24-0, ఆర్ష్‌దీప్‌ సింగ్‌ 4-0-42-2, సామ్‌ కర్రన్‌ 4-0-34-1, హర్‌ప్రీత్‌ బ్రార్‌ 1-0-19-0, రాహుల్‌ చాహర్‌ 4-0-23-3, హర్షల్‌ పటేల్‌ 4-0-24-3

పంజాబ్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌: ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (సి)రిజ్వి (బి)జడేజా 30, బెయిర్‌స్టో (బి) దేశ్‌పాండే 7, రూసో (బి)దేశ్‌పాండే 0, శశాంక్‌ సింగ్‌ (సి)సిమ్రన్‌జీత్‌ సింగ్‌ (బి)సాంట్నర్‌ 27, సామ్‌ కర్రన్‌ (సి)సాంట్నర్‌ (బి)జడేజా 7, జితేశ్‌ శర్మ (సి)ధోని (బి)సిమ్రన్‌జిత్‌ సింగ్‌ 0, అషుతోశ్‌ శర్మ (సి)సిమ్రన్‌జీత్‌ (బి)జడేజా 3, హర్‌ప్రీత్‌ బ్రార్‌ (నాటౌట్‌) 17, హర్షల్‌ పటేల్‌ (సి)రిజ్వి (బి)సిమ్రన్‌జీత్‌ సింగ్‌ 12, రాహుల్‌ చాహర్‌ (బి)శార్దూల్‌ ఠాకుర్‌ 16, రబడా (నాటౌట్‌) 11, అదనం 9. (20ఓవర్లలో 9వికెట్ల నష్టానికి) 139పరుగులు.
వికెట్ల పతనం: 1/9, 2/9, 3/62, 4/68, 5/69, 6/77, 7/78, 8/90, 9/117
బౌలింగ్‌: సాంట్నర్‌ 3-0-10-1, దేశ్‌పాండే 4-0-35-2, గ్లీసన్‌ 4-0-41-0, జడేజా 4-0-20-3, సిమ్రన్‌జీత్‌ సింగ్‌ 3-0-16-2, శార్దూల్‌ ఠాకూర్‌ 2-0-12-1.

➡️