మాయగాడు

Nov 26,2023 08:18 #sahityam

విద్వేషాలను రెచ్చగొట్టేవాడు

మహాత్మా ఫోటో పెట్టుకుంటున్నాడు.

ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేసేవాడు

బాబా సాహెబ్‌ బొమ్మ పెడుతున్నాడు.

దేశాన్ని విచ్ఛిన్నం చేసేవాడు

పటేల్‌ విగ్రహం కడుతున్నాడు.

సుభాష్‌ వారసులమని చెప్పుకునేవాడు

సామ్రాజ్యవాదానికి దాసోహమవుతున్నాడు.

వివేకానందుడు మా వాడే అనేవాడు

మతచిచ్చులు రేపుతున్నాడు.

బిర్సా ముండా పేరు చెప్పుకునేవాడు

గిరిజనుల భూములు కొట్టేస్తున్నాడు.

ఆత్మ నిర్భర్‌ నినాదమిచ్చేవాడు

ప్రభుత్వ సంస్థలు అమ్మేస్తున్నాడు.

మేక్‌ ఇన్‌ ఇండియా అని చెప్పేవాడు

విదేశీ సరుకులే వాడుతున్నాడు.

దేశ భక్తి జపం చేసేవాడు

దేశాన్ని తాకట్టు పెట్టేస్తున్నాడు.

పేరు విశ్వగురు అని చెప్పుకున్నా… వంచనకు మారుపేరీ మాయగాడు. – ఎ. అజ శర్మ

➡️