సోమేపల్లికి జోహార్లు !

Dec 18,2023 08:56 #sahityam

రైతు కుటుంబంలో జన్మించి

చిరు ఉద్యోగంతో జీవితమారంభించి

పలు శాఖల్లో పనిచేసి

మాలిన్యమెరుగని మనిషిగా వెలిగాడాయన !

 

నాలుగు పాదాల నానీలను

నవ్యాంధ్రలో నడిపించి

నానీల నాన్నకి అనుజుడైనానీల చిన్నాన్న తానయ్యాడు !

రైతు వ్యధలను రచనగా మలిచి

నాగలికి నమస్కారం పెట్టాడు

చేను చెక్కిన శిల్పాలు చదివించి

తొలకరి చినుకులు కురిపించాడు !

 

నవ్య కవుల నాదరించి

సృజనాత్మకతను ప్రోత్సహించి

నవ సాహితి క్షేత్ర హాలికుడై

సాహితీ జగతిన వెలుగొందాడు

 

సాహిత్య మార్గదర్శనం

కడు లెస్సగా చేసి

తన కలమును తనయునికిచ్చి

చరితర్ధుడయ్యాడు సోమేపల్లి !

 

అవయవ దానం చేసి

ఆదర్శ ప్రాయుడయ్యాడు

మనసా వాచా కర్మేణా

మంచి కవిగా నిలిచాడు !

(గురుతుల్యులు, గుంటూరు రచయితల సంఘం అధ్యక్షులు సోమేపల్లి వెంకట సుబ్బయ్య గారి అకాల మరణానికి చింతిస్తూ వారికి అక్షర నివాళి)

– అనిల్‌ కుమార్‌ దారివేముల 99512 44718

➡️