మనం మరిచిన అతని జీవితం

Nov 27,2023 08:13 #sahityam

అన్నం నీకు పెట్టి

పురుగు మందు తాను తింటాడు

తాను పస్తులుండి నీకు భోజన తృప్తిని

ఇస్తాడు

 

జీవితంలో రక్తాన్ని నదిగా చేసి

వ్యవసాయం చేస్తాడు …

అప్పుల కుప్పల కింద పూడుకుపోయిన

మౌనంతో సాగుతాడు

పేదరికపు సాలె గుడిలో చిక్కిన

పిచ్చి పురుగు …

అందరూ సుఖపడిన బతుకులో

అతనొక్కడు మాత్రమే!

ద్ణుఖాన్ని దిగమింగుకొని

ఛిద్రమైన జీవితంతో

దేశానికి ముఖచిత్రమవుతున్నాడు! – పుష్యమీ సాగర్‌79970 72896

➡️