sarvathrika elections live

  • Home
  • sarvathrika elections live

సార్వత్రిక ఎన్నికల పోలింగ్

2024-05-13 6:05:21 PM

సత్తెనపల్లి నియోజకవర్గం లో సాయంత్రం పోలింగ్ సమయం దాటిన పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు

 

2024-05-13 6:02:32 PM

అన్నమయ్య జిల్లాలో 5.00 గంటల వరకు పోలైన ఓట్లు: 9,66,194

జిల్లాలో మొత్తం ఓటర్ల సంఖ్య 14,26,834

పురుషులు (పోల్ ): 462956 (total – 700380)

మహిళలు (పోల్ ) 5,03190 (total 7,26,327)

థర్డ్ జెండర్ (పోల్) – 48 (127

2024-05-13 6:38:10 PM

తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్‌.. క్యూలైన్‌లో ఉన్నవారికే ఛాన్స్‌

అమరావతి/తెలంగాణ : తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్‌ ముగిసింది. తెలంగాణలో 17 లోక్‌సభ నియోజకవర్గాలతో పాటు సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో పోలింగ్‌ జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 లోక్‌సభ నియోజకవర్గాలలో పోలింగ్‌ ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌.. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. సాయంత్రం 6 గంటలకు ముందు క్యూలైన్‌లో నిల్చున్న వారికి.. సమయం ముగిసినా ఓటు వేసే అవకాశం కల్పించారు. ఇదిలా ఉండగా.. అతి సమస్యాత్మక నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్‌ ముగియగా.. సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల్లో 5 గంటలకు ముగిసింది. అక్కడక్కడ చెదురు ముదురు ఘటనలు మినహా పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగింది.సాయంత్రం 5 గంటల వరకు ఏపీలో 67.99 శాతం, తెలంగాణలో 61.66 శాతం పోలింగ్‌ నమోదైంది. జూన్‌ 4న ఫలితాలు వెలువడనున్నాయి.
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్‌ సాయంత్రం 4 గంటలకే ముగిసింది. తెలంగాణ రాష్ట్రంలోని 5 లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని 13 అసెంబ్లీ సెగ్మెంట్లలో సాయంత్రం 4 గంటలకు పోలింగ్‌ ముగిసింది. నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాలైన ఆసిఫాబాద్‌, సిర్పూర్‌, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, మంథని, భూపాలపల్లి, ములుగు, భద్రాచలం, పినపాక, ఇల్లందు, అశ్వరావుపేట, కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పోలింగ్‌ ముగిసింది. ఏపీలో అరకు, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్‌ ముగిసింది. సాయంత్రం 4గంటల లోపు క్యూలైన్లలో వేచి ఉన్నవారికి ఓటేసేందుకు అవకాశం ఇచ్చారు. సమస్యాత్మక నియోజకవర్గాలైన పాలకొండ, కురుపాం, సాలూరులో 5 గంటల వరకు పోలింగ్‌ ముగిసింది.
ఏపీలో కొన్ని ప్రాంతాల్లో హైటెన్షన్‌ వాతావరణం నెలకొంది. రాష్ట్రంలోని పలుచోట్ల ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి. పలు జిల్లాల్లో వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. ఈ నేపథ్యంలో కఅష్ణాజిల్లాలోని అవనిగడ్డ నియోజకవర్గంలో మోపిదేవి మండలం మోపిదేవి లంక గ్రామంలో వైసీపీ శ్రేణులపై టీడీపీ శ్రేణులు దాడికి దిగారు. ఘటనా స్థలంలో ఉన్న పోలీసులు వెంటనే స్పందించి ఇరు వర్గాలను చెదరగొట్టారు. మరోవైపు.. అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గం నియోజక వర్గంలో కుందిర్పి మండలం బెస్తరపల్లి గ్రామంలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇరువర్గాల నేతలు ఒకరిపై మరొకరు రాళ్లు రువ్వుకున్నారు. ఈ దాడుల్లో టీడీపీ అభ్యర్థికి చెందిన వాహనం అద్దాలు ధ్వంసమయ్యాయి. ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారంటూ ఇరువర్గాలు కొట్టుకున్నాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు.
పల్నాడు జిల్లా నరసరావుపేటలో తీవ్ర ఉద్రిక్త నెలకొంది. నరసరావుపేట మున్సిపల్‌ హైస్కూల్‌ పోలింగ్‌ కేంద్రంలో వైసీపీ, టీడీపీ కార్యకర్తలు గొడవపడ్డారు. దీంతో రెండు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఒకరిపై మరొకరు రాళ్ల దాడి చేసుకున్నారు. ఆ తర్వాత ఇరువర్గాల చెందిన వాహనాలను ధ్వంసం చేసుకున్నారు. టీడీపీ, వైసీపీ నేతల ఇళ్లపైనా రాళ్ల దాడి జరిగింది. దీంతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. వెంటనే అలర్ట్‌ అయిన పోలీసులు ఫైరింగ్‌ ఓపెన్‌ చేశారు. అల్లరి మూకలపై రబ్బర్‌ బుల్లెట్లు ప్రయోగించారు. కాగా, సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో పలుచోట్ల పలు దుర్ఘటనలు జరగడాన్ని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారం ముఖేష్‌ కుమార్‌ మీనా తీవ్రంగా పరిగణించారు. ముఖ్యంగా తెనాలి, మాచర్ల, అనంతపురంలో జరిగిన సంఘటలకు బాధ్యులైన వారిని వెంటనే గఅహ నిర్బంధం చేయటంతో.. కేసులు పెట్టాలని ఆయా జిల్లాల ఎన్నికల అధికారులు, పోలీస్‌ యంత్రాంగాన్ని ఆదేశించారు. ఇక, పుంగనూరులో జరిగిన సంఘటనలో నిందితులను వదిలేసిన ఎస్‌ఐ ని వెంటనే సస్పెండ్‌ చేయాలని సీఈవో ముకేష్‌ కుమార్‌ మీనాఆదేశించారు .

సాయంత్రం 5 గంటల వరకు ఏపీలో 67.04శాతం, తెలంగాణలో 61.16శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఏపీ పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో అత్యధికంగా చిత్తూరులో 74.06శాతం, అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 55.17శాతం పోలింగ్‌ నమోదైంది. తెలంగాణలో అత్యధికంగా భువనగిరిలో 72.34శాతం, అత్యల్పంగా హైదరాబాద్‌లో 39.17 శాతం ఓటింగ్‌ నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఏపీలో పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. తెలంగాణలో పోలింగ్‌ ప్రశాంతంగా సాగుతోంది. సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్‌ కేంద్రంలో ఉన్నవారికి ఓటు వేసేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించనుంది.

2024-05-13 5:47:05 PM

చివరి గంటల్లో పోలింగ్‌పై ఈసీ ప్రత్యేక దృష్టి

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ చివరి దశకు చేరుకుంది.. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన అరకు, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్‌ ముగించారు.. అంటే 4 గంటల వరకు క్యూలైన్‌లో ఉన్నవారికి ఓటింగ్‌కు అవకాశం కల్పిస్తున్నారు.. మరోవైపు.. రాష్ట్రవ్యాప్తంగా సాయంత్రం 6 గంటలకు పోలింగ్‌ ముగియనుంది.. పోలింగ్‌ సందర్భంగా పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో.. ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల సంఘం చివరి గంటల్లో ఎన్నికల నిర్వహణ సాఫీగా జరిగేలా ఫోకస్‌ పెట్టింది. చివరి రెండు గంటల్లో పోల్‌ వయొలెన్సుకు ఆస్కారం లేకుండా ఈసీ జాగ్రత్తలు తీసుకుంటుంది.. బూత్‌ క్యాప్చరింగ్‌, తగాదాలు జరగ్గకుండా చూడాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.. తెనాలి, మాచర్ల, అనంతపురం సంఘటలను ఈసీ తీవ్రంగా పరిగణించింది. ఈ ఘటనలకు బాధ్యలైన వారిని గఅహనిర్బంధం చేయాలని.. వారిపై కేసులు పెట్టాలని ఆదేశాలు జారీ చేసింది. తెనాలి ఎమ్మెల్యే సహా.. మాచర్ల, అనంతపురంలో హింసాత్మక ఘటనలకు కారణమైన వారిని హౌస్‌ అరెస్ట్‌ చేయాలని ఆదేశించింది. పుంగనూరులో నిందితులను వదిలేసిన ఎస్‌ఐ ని సస్పెండ్‌ చేయాలని ఆదేశించిన విషయం విదితమే.

Edit

 

గుంటూరు రోడ్డులోని వైసిపి అభ్యర్థి డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి కూటమి అభ్యర్థి డాక్టర్ చదలవాడ అరవిందబాబు హాస్పిటల్స్ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇరువురు అభ్యర్డుల కార్యాలయాల టిడిపి వైసిపి శ్రేణులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకునేందుకు కర్రలతో సిద్ధంగా ఉన్నారు.

సత్తెనపల్లి నియోజకవర్గం లో సాయంత్రం 5 గంటలకు 71శాతం పోలింగ్ నమోదు. పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు

మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం లో సాయంత్రం ఐదు గంటల వరకు నమోదైన పోలింగ్ శాతం 68.2 అని సమాచారం

గుంటూరు రోడ్డులోని వైసిపి అభ్యర్థి డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి కూటమి అభ్యర్థి డాక్టర్ చదలవాడ అరవిందబాబు హాస్పిటల్స్ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇరువురు అభ్యర్డుల కార్యాలయాల టిడిపి వైసిపి శ్రేణులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకునేందుకు కర్రలతో సిద్ధంగా ఉన్నారు.

2024-05-13  5:00:25 PM

పల్నాడులో ఫ్యాక్షన్‌ పంజా…

Video Player

గృహ నిర్బంధంలో మాచర్ల అభ్యర్థులు
ప్రజాశక్తి-ఎన్నికల డెస్క్
పల్నాడుప్రాంతంలో అందరూ ఊహించినట్లుగా అధికార, ప్రతిపక్ష పార్టీల అనుయాయుల మధ్య ఎన్నికల సందర్భంగా సోమవారం పలుచోట్ల ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఇరుపార్టీల వారు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. పోటీపోటీగా ఓటర్లను ఆకర్షించే ప్రక్రియలో ఇరుపార్టీల మధ్య తలెత్తిన వివాదాలు పలుచోట్ల ఘర్షణలకు దారితీశాయి. వైసీపీ అభ్యర్థి, మాచర్ల సిట్టింగ్‌ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, టిడిపి, జనసేన, బిజెపి కూటమి అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డిలను పోలీసులు గృహనిర్బంధంలో ఉంచారు. నియోజకవర్గంలో గొడవలు జరుగుతున్న నేపథ్యంలోనే ఈ అరెస్టులు జరిగినట్లుగా సమాచారం. మాచర్ల పట్టణంలో తెలుగుదేశం నాయకుడు కేశవరెడ్డి నివాసంలో ఉన్న ఆ పార్టీ నాయకులుపై వైసిపి వారు వచ్చి మూకుమ్మడి దాడులు చేశారు. మరికొందరు పారిపోతుండగా కారులో వెంబడించారు. ఈ దాడుల్లో పదిమంది వరకూ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను పోలీసులు స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. రెంటచింతల మండలం పాలువాయి గేటు గ్రామంలో మాచర్ల ఎమ్మెల్యే పిఆఆర్‌కె వాహనాన్ని టిడిపి వారు ధ్వంసం చేశారు. పల్నాడుజిల్లా ముప్పాళ్ళ మండలం నార్నెపాడులో పోలింగ్‌ను పరిశీలించడానికి వెళ్లిన అంబటి రాంబాబు అల్లుడు ఉపేష్‌ కారు పై టిడిపికి చెందిన వారు దాడి చేశారు. ఈ దాడిలో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఘటనను మంత్రి అంబటి రాంబాబు తీవ్రంగా ఖండించారు. ఓడిపోతామని నిరాశతో టీడీపీ నాయకులు దాడులకు తెగబడుతున్నారన్నారు. పోలీసులు రబ్బరు బుల్లెట్లను వినియోగించారు. తుళ్ళూరు మండలం పెదపరిమిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైసిపి నేత సందీప్‌,, టిడిపి నాయకుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పలువురు ఈ ఘటనలో గాయాలపాలయ్యాయి. గుంటూరు కొరిటపాడులో ఘర్షణ చోటుచేసుకుంది. పోలీసుల లాఠీ చార్జి చేశారు. ఈ ఘటనపై జిల్లా ఎస్‌పితో మంత్రి విడుదల రజనీ, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడారు. పల్నాడులో పోటాపోటీ దాడులుపల్నాడులో వైసిపి, టిడిపి నాయకులు భారీగా తెగబడుతున్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం ఉప్పలపాడులో వైసీపీ నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. టీడీపీ తరుపున ఏజెంట్‌ ఫామ్‌ ఇవ్వడానికి వెళ్లిన సుబ్బయ్యపై వైసీపీ శ్రేణులు దాడులకు పాల్పడ్డాయి. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన సుబ్బయ్యను వెంటనే నరసరావుపేట ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అలాగే అటు మాచర్ల నియోజకవర్గంలోనూ వైసీపీ దౌర్జన్యానికి దిగింది. రెంటచింతలలో టీడీపీ ఏజెంట్లు దాడికి పాల్పడ్డారు. నలుగురు టీడీపీ ఏజెంట్లకు తలలు పగిలాయి. ఏజెంట్లుగా టీడీపీ వాళ్లకు ఉండటానికి వీలేద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఈ ఘటనపై చంద్రబాబు సీరియస్‌ అయ్యారు. ఈవిఎంలను ధ్వంసం చేశారనే అభియోగంమాచర్ల నియోజకవర్గంలో ఈవీఎంలను టీడీపీ నేతలు ధ్వంసం చేశారని వైసిపి నాయకులు విమర్శించారు. రెంటచింతల మండలం తుమ్మూరు కోటలో మొత్తం ఆరు పోలింగ్‌ బూతులను అధికారులు ఏర్పాటు చేశారు. 203, 204, 206 పోలింగ్‌ బూత్‌ల్లో మూడు ఈవీఎంలను టీడీపీ నేతలు పగలగొట్టారని ఆరోపించారు. ఇరుపార్టీల వారు అన్ని పోలింగ్‌ కేంద్రాల వద్ద మోహరించటంతో ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. టిడిపి, వైసిపి వారు ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేసుకున్నారు.

2024-05-13  4:16:34 PM

ఏపీలో మధ్యాహ్నం 3 గంటల వరకు నమోదైన ఓటింగ్ శాతం…

ఆంధ్రప్రదేశ్‌లో క్రమంగా ఓటింగ్‌ శాతం పెరుగుతోంది. మరోవైపు పోలింగ్‌ స్టేషన్ల ఎదుట పెద్ద సంఖ్యలో క్యూలు దర్శనం ఇస్తుండడంతో భారీగా ఓటింగ్‌ నమోదవుతుందనే అంచనాలు నెలకొన్నాయి.. రాష్ట్రవ్యాప్తంగా మధ్యాహ్నం 3 గంటల వరకు 55.49 శాతం మేర పోలింగ్ నమోదు అయినట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ప్రకటించింది. మండుటెండను సైతం లెక్క చేయకుండా ఓటు వేసేందుకు ప్రజలు బారులు తీరారు. ఈ క్రమంలో చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్‌ ప్రశాంతంగా సాగుతోంది. ఏపీ సీఈవో ఎంకే మీనా పోలింగ్‌ సరళిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

రాష్ట్రంలోని ఆయా జిల్లాల వారీగా పోలింగ్‌ శాతాన్ని పరిశీలించినట్లు అయితే…..

* అల్లూరి జిల్లా – 48.87 శాతం
* అనకాపల్లి – 53.45 శాతం
* అనంతపురం – 54.25 శాతం
* అన్నమయ్య జిల్లా – 54.44 శాతం
* బాపట్ల – 59.49 శాతం
* చిత్తూరు – 61.94 శాతం
* అంబేద్కర్ కోనసీమ -59.73 శాతం
* తూ.గో. జిల్లా – 52.32 శాతం
* ఏలూరు – 57.11 శాతం
* గుంటూరు – 52.24 శాతం
* కాకినాడ – 52.69 శాతం
* కృష్ణా – 59.39 శాతం
* కర్నూలు – 52.26 శాతం
* నంద్యాల – 59.30 శాతం
* ఎన్టీఆర్ జిల్లా – 55.71 శాతం
* పల్నాడు – 56.48 శాతం
* పార్వతిపురం మన్యం – 51.75 శాతం
* ప్రకాశం జిల్లా – 59.96 శాతం
* నెల్లూరు – 58.14 శాతం
* శ్రీ సత్యసాయి జిల్లా- 57.56 శాతం
* శ్రీకాకుళం – 54.87 శాతం
* తిరుపతి – 54.42 శాతం
* విశాఖపట్నం – 46.01 శాతం
* విజయనగరం – 54.31 శాతం
* ప.గో. జిల్లా – 54.60 శాతం
* కడప – 60.57 శాతం పోలింగ్‌ నమోదైంది.

2024-05-13  3:25:28 PM

11గంటల సమయానికి 24 శాతం ఓటింగ్‌ నమోదు

న్యూఢిల్లీ :  లోక్‌సభ ఎన్నికల నాలుగో దశ పోలింగ్‌ కొనసాగుతోంది. 11 గంటల వరకు 24 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల కమిషన్‌ (ఇసి) తెలిపింది. ఎపిలో అసెంబ్లీ ఎన్నికలతో పాటు పది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 96 నియోజకవర్గాల్లో ప్రజలు తమ ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు. ఎపిలోని పలు ప్రాంతాల్లో ఘర్షణలు నెలకొన్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని పలు గ్రామాల్లో పోలింగ్‌ను బహిష్కరించారు. పశ్చిమబెంగాల్‌, ఒడిశాలోని పలు బూత్‌లలో ఇవిఎంలు పనిచేయడం లేదని నివేదికలు వెలువడ్డాయి. 11 గంటల సమయానికి జమ్ముకాశ్మీర్‌లో అతి తక్కువ ఓటింగ్‌ శాతం 14.94 శాతం నమోదు కాగా, పశ్చిమబెంగాల్‌లో అత్యధికంగా 32.78 శాతం ఓటింగ్‌ నమోదైంది.

2024-05-13  3:21:22 PM

వైసిపిపై టిడిపి దాడులు

అవనిగడ్డ నియోజకవర్గం మోపిదేవి మండలం మోపిదేవి లంక గ్రామంలో వైసీపీ వారిపై టిడిపి శ్రేణులు దాడిచేశారు. మోపిదేవి లంక గ్రామానికి చెందిన రాజుల పాటి నాగేశ్వరరావు, కేసాని తేజశ్రీ, మోర్ల శీను పై దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. ఇరుగ్రూపుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దాడిలో గాయాలైన వారిని అవనిగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. క్షతగాత్రులను అవనిగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్‌ బాబు బాధితులను పరామర్శించారు. టిడిపి, వైసిపిల మధ్య ఘర్షణకృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గంలోని గన్నవరం మండలం ముస్తాబాదలో టిడిపి, వైసిపిల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. డాక్టర్‌ వల్లభనేని వంశీమోహన్‌, యార్లగడ్డ వెంకట్రావుల అనుయాయుల మధ్య తోపులాట జరిగింది. పరస్పరం, చెప్పులు, రాళ్లు విసురుకున్నారు. వైసిపి నేతపై దాడిఎన్టీఆర్‌ జిల్లా మైలవరం గణపవరం గ్రామంలోని పోలింగ్‌ కేంద్రం వద్ద టిడిపి, వైసిపిల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. వైస్సార్సీపీ నాయకుడు కొత్తపల్లి వెంకటేశ్వరరావు పై టీడీపీ నాయకుడు శ్యామ్‌ దాడిచేశారు. కుర్చీతో దాడి చేయటంతో వెంకటేశ్వరరావు తలకు తీవ్ర గాయాలయ్యారు. పోలీసులు రంగ ప్రవేశం చేయటంతో ఇరుగ్రూపుల వారు పారిపోయారు. ఎన్నికల అధికారులతో వాగ్వాదం బందర్‌రోడ్డు మాంటిస్సోరి పాఠశాల పోలింగ్‌ కేంద్రంలో మౌలిక వసతులు లేక ఓటర్లు ఎన్నికల అధికారులతో వాగ్వివాదానికి దిగారు. ఓటర్లు రెండు గంటల తరబడి ఎండలో నిల్చోవాల్సివచ్చింది. ఇదేమిటని ప్రశ్నించిన ఓటర్లపై పోలింగ్‌ అధికారులు ఆగ్రహం వ్యక్తంచేశారు.నెల్లూరులో ఘర్షణ వాతావరణంనెల్లూరు జిల్లాలో పోలింగ్‌ ప్రశాంతంగా జరిగింది.ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోలేదు. ప్రజలు పోలింగ్‌ బూతులు వద్ద పెద్ద సంఖ్యలో క్యూలో నిలుచున్నారు. ఎప్పుడు ఈ విధంగా లేదు.ఈసారి ఎక్కువ శాతం పోలింగ్‌ శాతం పెరిగే అవకాశం ఉంది.చేజర్ల మండలంలో కొంత టిడిపి, వైసిపి నాయకులు మధ్య చిన్న ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు జోక్యం చేసుకోవడంతో అది కాస్త సద్దుమణిగింది. ఆత్మకూరు పట్టణంలో 128 పోలింగ్‌ బూత్‌ లో తమ ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం ఉదయం 6.30 గంటలకు పెద్ద ఎత్తున ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం బారులు తీరారు.

2024-05-13  3:02:33 PM

మాచర్ల వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, టిడిపి జనసేన బిజెపి కూటమి అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి లను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. నియోజకవర్గంలో గొడవలు జరుగుతున్న నేపథ్యంలోనే ఈ అరెస్టులు జరిగినట్లుగా తెలుస్తుంది.

2024-05-13  2:41:44 PM

ఓటు హక్కు ను వినియోగించుకున్న  కర్నూలు రేంజ్ డిఐజి సిహెచ్.విజయరావు

ప్రజాశక్తి కర్నూలు క్రైమ్ :  కర్నూలు జిల్లా కేంద్రంలో బి.క్యాంపులోని సిల్వర్ జూబ్లీ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో సోమవారం కర్నూలు రేంజ్ డిఐజి సిహెచ్. విజయరావు సతీమణితో కలిసి  ఓటు వేశారు.

2024-05-13  1:47:07 PM

10 రాష్ట్రాల్లోని 96 నియోజకవర్గాల్లో నేడు పోలింగ్

న్యూఢిల్లీ : లోక్‌సభ నాలుగో దశ ఎన్నికలకు సంబంధించి 10 రాష్ట్రాల్లోని 96 నియోజకవర్గాల్లో సోమవారం ఓటింగ్ జరుగుతోంది. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ 18వ లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను మార్చి 16న విడుదల చేశారు. ప్రకటన ప్రకారం, దేశవ్యాప్తంగా 543 నియోజకవర్గాలకు 7 దశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు మూడు దశల్లో (ఏప్రిల్ 19, ఏప్రిల్ 26, మే 7) 283 నియోజకవర్గాలకు పోలింగ్ పూర్తయింది. 9 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం సహా 10 రాష్ట్రాల్లోని 96 నియోజకవర్గాలకు 4వ దశ పోలింగ్ సోమవారం జరుగుతున్నది.

రాష్ట్రాలు – నియోజకవర్గాలు
1. ఆంధ్రప్రదేశ్          – 25
2. బీహార్                      – 5
3. జమ్మూ కాశ్మీర్        – 1
4. జార్ఖండ్                   – 4
5. మధ్యప్రదేశ్           – 8
6. మహారాష్ట్ర             – 11
7. ఒడిశా                      – 4
8. తెలంగాణ              – 17
9. ఉత్తరప్రదేశ్          – 13
10. పశ్చిమ బెంగాల్  – 8
కాగా, సోమవారం ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం 25 లోక్‌సభ నియోజకవర్గాలు, తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలకు ఒకే దశలో లోక్‌సభ ఎన్నికలు పూర్తవుతాయి. అదేవిధంగా 4 దశల్లో జరుగుతున్న మధ్యప్రదేశ్ రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల పోలింగ్ సోమవారంతో ముగియనుంది. కాగా, ఆంధ్రప్రదేశ్‌, ఒడిశాలో లోక్‌సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరుగుతుండగా, ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకే దశలో, ఒడిశాలోని 147 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను మొదటి దశలో 28 నియోజకవర్గాలకు సోమవారం పోలింగ్ జరుగుతోంది.

 

2024-05-13  1:28:22 PM

ఎన్నికల విధులు నిర్వహిస్తుండగా గుండెపోటు… ఉద్యోగి మృతి
భద్రాద్రి కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం(Bhadradri Kothagudem) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పార్లమెంట్‌ (Parliament elections) ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగి గుండెపోటుతో(Employee died)మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన అశ్వరావుపేట నెహ్రూ నగర్‌లో చోటు చేసుకుంది. నెహ్రూ నగర్‌ 165 పోలింగ్ బూత్‌లో విధులు నిర్వహిస్తున్న శ్రీ కృష్ణ అనే ఉద్యోగి గుండెపోటుతో మృతి చెందాడు. మృతుడు కొత్తగూడెం జిల్లా చుంచుపల్లిలో సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నాడు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

2024-05-13 – 12:25:56

ఓటుకు డబ్బు ఇవ్వలేదంటూ … ఓటర్ల ఆందోళన

తాడేపల్లిగూడెం (పశ్చిమ గోదావరి) : పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలంలోని కేఎస్‌ఎన్‌ కాలనీ కొండ్రుప్రోలు మెట్ట వేపచెట్టు దగ్గర వైసీపీ నేతలు ఓటుకు నోటు నగదు పంపిణీ నిలిపివేయడంతో ఓటర్లు ఆందోళన చేపట్టారు

2024-05-13 – 12:17:02

బోటుపై పోదాం – ఓటేద్దాం..!

విఆర్‌.పురం (అల్లూరు) : సార్వత్రిక ఎన్నికల వేళ … తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజలు సోమవారం ఉదయం నుండే పోలింగ్‌ బూత్‌ల వద్దకు చేరుకొని క్యూలో నిలబడుతున్నారు. దూరాభారాల నుండి వచ్చేవారు పలు వాహనాల్లో పోలింగ్‌ బూత్‌ల వద్దకు చేరుకొని ఓటేస్తున్నారు. ఈ నేపథ్యంలో … తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు విఆర్‌ పురం మండలంలోని కొల్లూరు గొందూరు తుమ్మలేరు గ్రామపంచాయతీలో గ్రామం నుండి ఓటర్లు బోట్లపై ప్రయాణించి పోలింగ్‌ బూత్‌ల వద్దకు చేరుకొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

2024-05-13 – 12:15:40

ఓటేసేందుకు క్యూలో నిలబడి కుప్పకూలి వృద్ధురాలు మృతి

ప్రజాశక్తి-నెల్లిమర్ల (విజయనగరం) : ఓటేసేందుకు క్యూ లైన్‌లో నిలబడి వృద్ధురాలు మృతి చెందిన ఘటన సోమవారం నెల్లిమర్ల మండలం, తంగుడుబిల్లి గ్రామంలోని పోలింగ్‌ బూత్‌ వద్ద జరిగింది. తంగుడుబిల్లి పోలింగ్‌ బూత్‌ వద్ద పాలూరి పెంటమ్మ (65) ఓటు వేసేందుకు క్యూలైన్లో ఉండి ఒక్కసారిగా కుప్పకూలి కన్నుమూసింది. ఈ సంఘటనతో ఓటర్లంతా ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయారు. వెంటనే ఆమె మృతదేహాన్ని అక్కడి నుండి కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకు వెళ్ళిపోయారు.

2024-05-13 – 12:14:06

ఓటేసిన ఎపి గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌

విజయవాడ : విజయవాడ మధ్య నియోజకవర్గంలోని రైల్వే ఫంక్షన్‌ హాల్‌ పోలింగ్‌ కేంద్రంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

2024-05-13 – 12:11:44

ఓటరుపై తెనాలి ఎమ్మెల్యే దౌర్జన్యం – వీడియో వైరల్‌ ..!

తెనాలి : సార్వత్రిక ఎన్నికలు కొనసాగుతోన్న వేళ … తెనాలిలో అవాంఛనీయ ఘటన జరిగింది. ఉదయం నుండి క్యూలో నిలబడి వరుసగా ఓటు వేస్తున్న ఓటర్లను దాటుకుంటూ … తెనాలిలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే, వైసిపి అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్‌ పోలింగ్‌ కేంద్రంలోకి నేరుగా వెళ్లారు. లైన్‌లో రాకుండా ఇలా నేరుగా వచ్చారేంటి అని సామాన్య ఓటరు ప్రశ్నించారు. దీంతో ఎమ్మెల్యే మండిపడ్డారు ఓటరు చెంపపై ఛెళ్లున కొట్టారు. అంతే స్పీడుతో ఆ ఓటరు ఎమ్మెల్యే చెంపపై కొట్టారు. ఇదంతా చూసిన ఎమ్మెల్యే అనుచరులు ఆ ఓటరుపై విరుచుకుపడ్డారు. మూకుమ్మడిగా దాడి చేశారు. పిడిగుద్దులు కొడుతూ బయటకు లాక్కెళ్లి విచక్షణారహితంగా కొట్టారు. ఈ దౌర్జన్యమంతా గుంటూరు జిల్లా తెనాలిలోని పోలింగ్‌ బూత్‌ లో జరిగింది. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది.

2024-05-13 – 11:15:34

కృష్ణా జిల్లాలో ఓటేసిన సిపిఎం మాజీ ఎమ్మెల్యే పాటూరి రామయ్య

కృష్ణా : కృష్ణా జిల్లాలోని చల్లపల్లి జడ్పీ హైస్కూల్‌ పోలింగ్‌ కేంద్రంలో సిపిఎం మాజీ ఎమ్మెల్యే పాటూరు రామయ్య ఓటు హక్కును వినియోగించుకున్నారు.

2024-05-13 – 11:09:37

కృష్ణా జిల్లా 9 గంటలకు సరాసరి పోలింగ్‌ శాతం : 10.8 శాతం

ప్రజాశక్తి-కలెక్టరేట్‌ (కృష్ణా) : సాధారణ ఎన్నికలు – 2024 సందర్భంగా ఈరోజు కృష్ణా జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల్లో ఏడు శాసనసభ నియోజకవర్గాలతోపాటు మచిలీపట్నం పార్లమెంట్‌ నియోజకవర్గాల పరిధిలో ఆయా పోలింగ్‌ కేంద్రాలలో ఉదయం 9 గంటల వరకు నమోదైన పోలింగ్‌ శాతం వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

71-గన్నవరం శాసనసభ నియోజకవర్గం: 10 శాతం

72-గుడివాడ శాసనసభ నియోజకవర్గం: 09 శాతం

74-పెడన శాసనసభ నియోజకవర్గం: 12.7 శాతం

75-మచిలీపట్నం శాసనసభ నియోజకవర్గం: 10.49 శాతం

76-అవనిగడ్డ శాసనసభ నియోజకవర్గం: 10.74 శాతం

77-పామర్రు శాసనసభ నియోజకవర్గం: 12.42 శాతం

78-పెనమలూరు శాసనసభ నియోజకవర్గం: 10.98 శాతం

2024-05-13 – 11:07:45

ఎన్‌టిఆర్‌ జిల్లాలో ఉదయం 9 గంటలకు పోలింగ్‌ శాతం

2024-05-13 – 10:40:56

2024 AP Elections- ఉదయం 10 గంటలకు 15 శాతం మేర పోలింగ్‌

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 10 గంటల వరకు 15 శాతం మేర పోలింగ్‌ నమోదయిందని ఎన్నికల కమిషన్‌ వెల్లడించింది. అత్యధికంగా గాజువాక సెగ్మెంట్లో 19.1 శాతం పోలింగ్‌ నమోదు కాగా, అత్యల్పంగా యర్రగొండపాలెంలో కేవలం 5.2 శాతం మేర పోలింగ్‌ నమోదు అయినట్లు తెలిపారు.

2024-05-13 – 10:17:26

ఓటర్ల నిరసనలు – వెలవెలబోతున్న పోలింగ్‌ కేంద్రాలు..!

తెలంగాణ : ఓటరు సత్తా తెలిసేది ఓటేసే రోజే … ఈ సార్వత్రిక ఎన్నికలప్పుడే కదా…! మా సమస్యలు పట్టించుకోండయ్యా.. అంటూ అన్నదాతలు, ప్రజలు ఎంత మొత్తుకున్నా… కన్నెత్తి కూడా చూడని పాలకులు, నాయకులు ఇప్పుడు ఓట్ల కోసం మీతోనే మేము అంటూ… ఓటర్లను బుజ్జగిస్తుంటారు. ముందుగా మా సమస్యల్ని పరిష్కరించండి-అప్పుడు ఓటేస్తాం అంటూ .. అన్నదాతలు, బాధిత ప్రజలు తెలంగాణలో నిరసన చేపట్టారు.

2024-05-13 – 10:02:00

ఓటేసిన మాజీ ఉపరాష్ట్రపతి – తెలుగు హీరోలు జూ.ఎన్‌టిఆర్‌-అల్లు అర్జున్‌

తెలంగాణ : తెలంగాణ రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలు, సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ అసెంబ్లీ ఉప ఎన్నిక పోలింగ్‌ సోమవారం కొనసాగుతున్నది. తెలుగు చిత్రసీమ హీరోలు జూనియర్‌ ఎన్‌టిఆర్‌, అల్లు అర్జున్‌ తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. తల్లి, భార్యతో కలిసి జూబ్లీహిల్స్‌లోని ఓ పోలింగ్‌ కేంద్రానికి చేరుకున్న జూనియర్‌ ఎన్‌టిఆర్‌.. అందరితో కలిసి క్యూలైన్‌లో నిలుచొని ఓటు వేశారు. ఉదయాన్నే ఫిలింనగర్‌లోని బిఎస్‌ఎన్‌ఎల్‌ ఆఫీస్‌లో ఉన్న పోలింగ్‌ కేంద్రానికి వచ్చిన అల్లు అర్జున్‌.. క్యూలైన్‌లో నిలుచొని ఓటు వేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ … ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పారు. తనకు ఏ పార్టీతో సంబంధం లేదని, సన్నిహితులైనవారికి మద్దతునిస్తానని చెప్పారు.

2024-05-13 – 09:51:34

అన్నమయ్య జిల్లా పోలింగ్‌ కేంద్రంలో ఈవిఎంలు ధ్వంసం

రైల్వే కోడూరు (అన్నమయ్య) : అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలోని దలవాయి పోలింగ్‌ కేంద్రంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలింగ్‌ కేంద్రంలో ఉన్న జనసేన ఏజెంట్‌ రాజారెడ్డిని వైసిపి కార్యకర్తలు పోలింగ్‌ కేంద్రం నుంచి బలవంతంగా బయటకు తీసుకెళ్లారు. దీంతో పాటు ఈవిఎంలు ధ్వంసం చేయడంతో పోలింగ్‌ నిలిచిపోయింది.

2024-05-13 – 09:44:54

మంగళగిరిలో ఓటేసిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌

మంగళగిరి (గుంటూరు) : జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ తన భార్యతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. సోమవారం ఉదయం మంగళగిరిలోని పోలింగ్‌ కేంద్రానికి వెళ్లిన ఆయన పోలింగ్‌ సిబ్బందిని కలిశారు. పవన్‌ కల్యాణ్‌ చేతి వేలిపై సిరా ముద్ర వేసి ఈవీఎం మిషన్‌ దగ్గరకు సిబ్బంది పంపించడంతో పవన్‌ కళ్యాణ్‌ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

2024-05-13 – 09:31:54

Bihar లో కొనసాగుతోన్న లోక్‌ సభ ఎన్నికల నాలుగో దశ పోలింగ్‌

బీహార్‌ : బీహార్‌లో లోక్‌ సభ ఎన్నికల నాలుగో దశ పోలింగ్‌ సోమవారం కొనసాగుతోంది. దర్భంగాలోని హౌలీ క్రాస్‌ స్కూల్‌లోని ఆదర్శ్‌ పోలింగ్‌ సెంటర్‌ వద్ద ఉత్సాహంగా ఓటింగ్‌ జరుగుతోంది. ముందుగా ఇద్దరు పెద్దలు తమ ఓటు వేసి, యువత తప్పక ఓటు వేయాలని పిలుపునిచ్చారు.

2024-05-13 – 09:22:52

గుండెపోటుతో ప్రిసైడింగ్‌ అధికారి మృతి

బీహార్‌ : బీహార్‌లో లోక్‌సభ ఎన్నికల నాలుగో దశ పోలింగ్‌ వేళ… ముంగేర్‌లోని చకాసిం ఇబ్రహీం శంకర్‌పూర్‌ మిడిల్‌ స్కూల్‌లోని బూత్‌ నంబర్‌ 210లో విషాదం జరిగింది. డ్యూటీ చేస్తున్న ప్రిసైడింగ్‌ అధికారి ఓంకార్‌ చౌదరి గుండెపోటుతో మృతి చెందారు. అతని ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. అతన్ని ఆసుపత్రికి తరలించేలోగానే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్థారించారు.

2024-05-13 – 09:09:59

ఓటు హక్కు వినియోగించుకున్న చంద్రబాబు కుటుంబం

ఉండవల్లి (గుంటూరు) : టిడిపి అధినేత చంద్రబాబు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉండవల్లిలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రానికి చంద్రబాబు ఆయన భార్య భువనేశ్వరితో కలిసి చేరుకొని ఓటు వేశారు. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌, ఆయన భార్య బ్రాహ్మణి అదే పోలింగ్‌ కేంద్రంలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రజలంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఓటు వేసేందుకు జనం చూపిస్తున్న చొరవ మరువలేనిదన్నారు. ఈ ఎన్నికలు చాలా ప్రత్యేకమైనవని తెలిపారు. భవిష్యత్తును తీర్చిదిద్దేవి ఈ ఎన్నికలే అని ప్రజలు గుర్తించారన్నారు.

ఎపిలో రికార్డు స్థాయిలో పోలింగ్‌లో పాల్గొనండి : ప్రధాని మోడి

2024-05-13 – 09:10:51

న్యూఢిల్లీ : అసెంబ్లీ సహా లోక్‌సభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు రికార్డు స్థాయిలో పోలింగ్‌లో పాల్గొనాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడి పిలుపునిచ్చారు. ముఖ్యంగా మొదటిసారి ఓటు వేసేవారు తప్పకుండా తమ హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఈ ఎన్నికలు ప్రజాస్వామ్య స్ఫూర్తిని మరింత పెంచుతాయని ఆశిస్తున్నానన్నారు. అలాగే నాలుగో దశలో భాగంగా దేశవ్యాప్తంగా పోలింగ్‌ కొనసాగుతున్న అన్ని ప్రాంతాల్లోనూ ఓటర్లు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. ప్రతిఒక్కరూ తమ కర్తవ్యాన్ని నిర్వర్తించి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని మోడి పిలుపునిచ్చారు.

 

పులివెందులలో ఓటేసిన సిఎం జగన్‌

2024-05-13 – 09:13:20

కడప : ఎపి ముఖ్యమంత్రి జగన్‌ కుటుంబ సభ్యులతో కలిసి పులివెందులలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. పులివెందుల భాకరాపురం 138 పోలింగ్‌ బూత్‌లో సిఎం జగన్‌ ఓటేశారు. అనంతరం సిఎం జగన్‌ మీడియాతో మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరూ ఓటేయాలని కోరారు. దీనికి ముందు ఎక్స్‌ ఖాతాలోనూ సిఎం జగన్‌ ఎపి ఓటర్లకు పిలుపునిచ్చారు. అందరూ కదిలి రండి, తప్పకుండా ఓటు వేయండి అని కోరారు.

AP Elections 2024 – మొరాయిస్తున్న ఈవిఎంలు – అసహనంతో ఓటర్లు

2024-05-13 – 09:14:20

అమరావతి : సార్వత్రిక ఎన్నికల వేళ … నేడు ఎపిలో పోలింగ్‌ ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండే ఓటర్లు పోలింగ్‌ కేంద్రాల వద్ద క్యూలు కట్టారు. అయితే పలుచోట్ల ఈవీఎంలు మొరాయించాయి. దీంతో ఎన్నికల సంఘం అధికారులు అప్రమత్తమై వెంటనే వాటిలోని సమస్యను పరిష్కరించేందుకు టెక్నిషన్స్‌ ను రంగంలోకి దించారు.

Telugu States సార్వత్రిక ఎన్నికల తుదిపోరు ప్రారంభం

2024-05-13 – 09:15:37

అమరావతి : తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల తుదిపోరు సోమవారం ప్రారంభమైంది. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయం 7 గంటల నుండే పోలింగ్‌ బూతుల వద్ద ప్రజలు బారులు తీరారు. ఎపిలోని మొత్తం 175 శాసనసభ, 25 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ నిర్వహిస్తున్నారు.

2024-05-12 19:30.11

వైసిపి నేతల దాడిలో పలువురికి గాయాలు


రెంటచింతల: పోలింగ్‌ సమయం దగ్గరపడుతున్న వేళ.. పల్నాడు జిల్లా రెంటచింతలలో వైసిపి వర్గీయులు రెచ్చిపోతున్నారు. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో దాడులకు తెగబడుతున్నారు. ఆదివారం.. తెదేపా పోలింగ్‌ ఏజెంట్ల ఇళ్లకు వెళ్లి బెదిరించారు. ఏజెంట్లుగా ఉండొద్దని హెచ్చరించారు. దీంతో తెదేపా నేతలకు ఏజెంట్‌ సమాచారం ఇవ్వడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. వైసిపి నేతల దాడిలో పలువురు టిడిపి కార్యకర్తలకు గాయాలయ్యాయి. పోలీసులు రంగంలోకి దిగి ఇరువర్గాలను చెదరగొట్టారు. గాయపడిన వారిని గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

2024-05-12 18:09:48

పోలింగ్‌ కేంద్రాల వద్ద భద్రత పెంచాలి: కూటమి నేతలు

అమరావతి: రాయలసీమ జిల్లాల్లోని సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల్లో సాయుధ బలగాలను పెంచాలని ఎన్డీయే కూటమి నేతలు సీఈవో ముకేశ్‌ కుమార్‌ మీనాను కోరారు. ధర్మవరం, జమ్మలమడుగు, బద్వేల్‌ నియోజకవర్గాలు సమస్యాత్మకంగా ఉన్నాయన్నారు. వీటిని క్రిటికల్‌ సెన్సిటివ్‌ నియోజకవర్గాలుగా ఇప్పటికే గుర్తించారన్నారు. కేంద్ర బలగాలను మోహరించాలని ధర్మవరం కూటమి అభ్యర్థి సత్యకుమార్‌ హైకోర్టులో కేసు వేశారని భాజపా నేత యామినీ శర్మ తెలిపారు. కోర్టు తీర్పు సారాంశాన్ని ఎన్నికల ప్రధానాధికారికి నివేదించామన్నారు. భద్రత పెంచే విషయమై డీజీపీకి కూడా వినతిపత్రం ఇచ్చినట్లు తెలిపారు. రాయలసీమలో ఎన్నికలను ప్రభావితం చేయడానికి అధికార పార్టీ నేతలు ప్రలోభాలకు దిగుతున్నారని ఆరోపించారు.

2024-05-12 17:52:03

ఫేక్‌ ఆడియో సందేశం సర్క్యులేట్‌పై చంద్రబాబు ఆగ్రహం

  •  పోలీసులు, ఎన్నికల అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి

ప్రజాశక్తి-అమరావతి : సోషల్‌ మీడియాలో తన పేరిట ఓ ఆడియో సందేశం వైరల్‌ అవుతుండడంపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పథకాల్లేవ్‌ ఏం లేవ్‌… మా ఆస్తులన్నీ అమరావతిలోనే ఉన్నాయి.. త్వరలోనే మీకు లాభాలు చూపిస్తా.. అంటూ తన వాయిస్‌తో ఈ మెసేజ్‌ రూపొందించారని చంద్రబాబు మండిపడ్డారు. ప్రజలు ఎవరూ ఈ తప్పుడు ప్రచారాలను నమ్మవద్దు. కుట్రలతో తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిపై పోలీసులు, ఎన్నికల అధికారులు తక్షణమే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలి” అని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ”ఓటమి అంచుల్లో ఉన్నా వైసీపీకి బుద్ధి రావడం లేదు. ఇంకా ఫేక్‌ వీడియోలు, ఆడియోలు, పోస్టులతో జనాలను మోసం చేయాలని చూస్తున్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు డీప్‌ ఫేక్‌ ఆడియోలు, ఫేక్‌ లెటర్లు సష్టిస్తున్నారు.” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

2024-05-12  17:47:33

తిరుపతిలో ఐదుగురు సీఐల బదిలీ..!

ప్రజాశక్తి-తిరుపతి: మరి కొన్ని గంటల్లో పోలింగ్‌ ప్రారంభం కానున్న వేళ పోలీసు అధికారులపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. తిరుపతికి చెందిన ఐదుగురు సీఐలను అనంతపురం జిల్లాకు బదిలీ చేసింది. వైసిపి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ టిడిపి నేతలు ఫిర్యాదు చేయడంతో.. సీఐలు జగన్మోహన్‌రెడ్డి, అంజూయాదవ్‌, అమర్‌నాథ్‌రెడ్డి, శ్రీనివాసులు, వినోద్‌కుమార్‌లను అనంతపురానికి ఈసీ బదిలీ చేసింది.

2024-05-12 4:28:06 PM

నంద్యాల ఎస్‌పి, ఎస్‌డీపీవో, సిఐపై చర్యలకు ఈసీ ఆదేశం


ప్రజాశక్తి-అమరావతి: నంద్యాల ఎస్పీ రఘువీరారెడ్డిపై చర్యలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎన్నికల కోడ్‌ అమల్లో విఫలమైన ఎస్పీపై ఛార్జెస్‌ ఫైల్‌ చేయాలని ఈసీ ఆదేశించింది. ఎస్పీతో పాటు ఎస్‌డీపీవో రవీంద్రనాథ్‌రెడ్డి, సీఐ రాజారెడ్డిపైనా శాఖాపరమైన విచారణ జరపాలని డీజీపీకి ఉత్తర్వులు జారీ చేసింది. నంద్యాలలో సినీ నటుడు అల్లు అర్జున్‌ పర్యటన వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ఆయన పర్యటనకు రిటర్నింగ్‌ అధికారి ముందస్తు అనుమతులు ఇవ్వలేదు. ఆయన పర్యటనకు అధికారిక అనుమతులూ లేకపోయినా పోలీసులు విస్తత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఈ విషయాన్ని కొందరు ఎన్నికల కమిషన్‌ దష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో పోలీసుల తీరుపై ఫిర్యాదులు అందడంతో ఎన్నికల సంఘం స్పందించింది.

2024-05-12 16:20:48

విశాఖలో ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ తనిఖీలు.. కారులో రూ.కోటిన్నర వదిలేసి పరార్‌..
ప్రజాశక్తి-విశాఖపట్నం: సార్వత్రిక ఎన్నికల వేళ విశాఖ నగరంలో భారీగా నగదు పట్టుబడింది. ఆర్కే బీచ్‌ సమీపంలోని పాండురంగాపురం వద్ద రూ.కోటిన్నర నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నగదు తరలిస్తున్నట్లు సీ విజిల్‌ యాప్‌ ద్వారా సమాచారం రావడంతో జిల్లా ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ తనిఖీలు చేపట్టారు. అధికారులను చూడగానే.. కారులో ఉన్న నిందితులు వాహనాన్ని, డబ్బును వదిలేసి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

14:52:572024-05-12

కనీస వసతులు కూడా లేవు : పోలింగ్‌ సిబ్బంది ఆగ్రహం

ప్రజాశక్తి-చిలకలూరిపేట (గుంటూరు) : స్థానిక గణపవరం సి.ఆర్‌. కళాశాలలో ఎన్నికల సిబ్బందికి సామాగ్రి, తదితర వాటి గురించి ఏర్పాటు చేసే విషయంలో ఉద్యోగులందరు అసౌకర్యానికి గురయ్యారు. ఈ నెల 13వ తేదీన జరిగే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా చిలకలూరిపేట సిఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో పోలింగ్‌ సిబ్బందికి సామాగ్రి తదితర ఏర్పాట్లను చేశారు. అయితే ఎన్నికల అధికారులు పూర్తిస్థాయిలో పోలింగ్‌ సిబ్బందికి సౌకర్యాలు కల్పించడంలో ఫెయిల్‌ అయ్యారని ఉద్యోగస్తులు అంటున్నారు. పోలింగ్‌ సిబ్బంది సరైన కుర్చీలు, టిఫిన్‌ లేక భోజనాలు లేక కిందనే కూర్చోవడంతో అనేకమంది మహిళలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కొంతమందికి సరైన మంచినీటి సౌకర్యాలు, బాత్‌ రూంలు లేవని పోలింగ్‌ సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం సుమారుగా 2300 మంది హాజరయ్యారు. దీనికిగాను కోటి ముప్పై లక్షల రూపాయలు కేటాయించినట్లు సమాచారం. ఆదివారం సాయంత్రం పోలింగ్‌ కేంద్రాలకు సామాగ్రి చేరుస్తారు.

 

2024-05-12 14:38:44

పాలకొల్లు ఎన్నికల డ్యూటీలో తమిళనాడు హోం గార్డులు

పాలకొల్లు (పశ్చిమ గోదావరి) : రాష్ట్రంలో ఈనెల 13 వ తేదీన జరిగే పోలింగ్‌ కు తగిన ఎపి పోలీస్‌ సిబ్బంది లేకపోవడంతో తమిళనాడు హోం గార్డులను రప్పించారు. పాలకొల్లు నియోజకవర్గంలో 190 పోలింగ్‌ కేంద్రాలు ఉండగా సగానికి పైగా పోలింగ్‌ కేంద్రాలకు ఎపి పోలీస్‌ సిబ్బంది లేకపోవడంతో తమిళనాడు హోం గార్డులను డ్యూటీ గా వేశారు. నాగాలాండ్‌ నుంచి వచ్చిన సిఆర్‌పిఎఫ్‌ దళాలు గత నెల రోజులుగా పాలకొల్లు ఎఎస్‌ఎన్‌ఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇవిఎం స్ట్రాంగ్‌ రూం ల గస్తీ కాస్తున్నారు. నరసాపురం డివిజన్‌ లోని పలు పట్టణాలు, గ్రామాల్లో మార్చ్‌ ఫాస్ట్‌ నిర్వహిస్తున్నారు. నియోజకవర్గంలోని ఏ గ్రామంలోనైనా సమస్య ఏర్పడితే తక్షణం ప్రత్యేక టీం లు, దళాలు స్పందిస్తాయి.

2024-05-12 14:34:05

పోలింగ్‌ రోజున వాడే సిరాపై తప్పుడు ప్రచారం.. ఈసీ వార్నింగ్‌
ప్రజాశక్తి-అమరావతి : ఇతర సిరా ద్వారా ఓటర్ల వేళ్లపై మార్కు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) ముకేశ్‌కుమార్‌ మీనా హెచ్చరించారు. ఓటర్ల వేళ్లపై చెరగని సిరాతో మార్కు చేస్తున్నట్లు సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోందని.. అలా చేయడం సరికాదన్నారు. భారత ఎన్నికల సంఘం వద్ద మాత్రమే చెరగని సిరా ఉంటుందని అన్నారు. ఒకవేళ ఇతర సిరాలతో ఓటర్ల వేళ్లపై మార్కు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల వేళ ఎవరు నిబంధనలు ఉల్లంఘించిన ఏమాత్రం సహించబోము అని స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు.

2024-05-12 12:02:43

ఎన్నికల విధుల్లో సొమ్మసిల్లి పడిపోయిన పోలింగ్‌ ఆఫీసర్‌

ప్రజాశక్తి-నెల్లిమర్ల (విజయనగరం) : నెల్లిమర్ల నియోజవర్గం కేంద్రంలోని డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్లో పోలింగ్‌ విధి నిర్వహణకు వచ్చిన పోలింగ్‌ ఆఫీసర్‌ శ్రీ మాధవన్‌ ఒక్కసారిగా సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే తోటి ఉద్యోగులు వచ్చి సపర్యలు చేశారు. మెడికల్‌ సిబ్బంది వైద్య పరిక్షలు చేశారు. ఆయన పూసపాటి రేగ మండలం పశుపాంలో పోలింగ్‌ అధికారిగా విధులు నిర్వహించాల్సి ఉంది. దత్తి రాజేరు మండలం పెదకాద ఎలిమెంటరీ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. శ్రీ మాధవన్‌ సొమ్మసిల్లి పడిపోయి గంట సేపు అయినప్పటికీ పక్కనే వున్న రిటర్నింగ్‌ అధికారి నూకరాజు కనీసం పట్టించుకోకపోవడం పట్ల ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

2024-05-12 10:24:20 AM

ఎన్నికల విధులకు వెళ్తూ తల్లీకుమారుడు మృతి

ప్రజాశక్తి-కావలి: నెల్లూరు జిల్లా కావలిలో విషాదం చోటు చేసుకుంది. ఎన్నికల విధులకు వెళ్తూ తల్లీకొడుకు మృతి చెందారు. సైదాపురం మండలం చాగనం గ్రామానికి చెందిన బి.సుభాషిణి (55) అంగన్వాడీ ఆయాగా పని చేస్తున్నారు. అధికారులు ఆమెకు కావలిలో ఎన్నికల విధులు కేటాయించారు. విధుల కోసం వెళ్తుండగా.. రైల్వే ట్రాక్‌ దాటుతుండగా సుభాషిణిని రైలు ఢకొీట్టింది. కాపాడేందుకు వెళ్లిన కొడుకు విజరు (19) కూడా ప్రాణాలు విడిచాడు.

2024-05-12  10:20:17 AM

పోలింగ్‌కు సర్వం సిద్దం :సిఇఓ ముఖేష్‌కుమార్‌మీనా

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : సోమవారం జరగనున్న సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయని సిఇఓ ముఖేష్‌కుమార్‌మీనా వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 175 శాసనసభ, 25 పార్లమెంటరీ నియోజకవర్గాల పరిధిలో ఎన్నికలు జరగనుండగా ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలు మినహా మిగిలిన 169 నియోజకవర్గాల్లో పోలింగ్‌ ఉదయం 7గంటలకు ప్రారంభమై సాయంత్రం 6గంటల వరకు జరుగనుంది. పాలకొండ (ఎస్‌టి), కురుపాం (ఎస్‌టి), సాలూరు (ఎస్‌టి) నియోజకవర్గాల్లో పోలింగ్‌ ఉదయం 7 గంటలనుంచి సాయంత్రం 5గంటల వరకు, అరుకు వ్యాలీ(ఎస్‌టి) పాడేరు (ఎస్‌టి)రంపచోడవరం (ఎస్‌టి) నియోజకవర్గాల్లో ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్‌ జరుగుతుందని సిఇఓ తెలిపారు.

2024-05-11  5:12:02 PM

జగన్‌ రాయలసీమకు చేసిందేమీలేదు: చంద్రబాబు

ప్రజాశక్తి-నంద్యాల :రాయలసీమకు సిఎంగా వైఎస్‌ జగన్‌ చేసిందేమీలేదని టిడిపి జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం నంద్యాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో ఆయన పాల్గని ప్రసంగించారు. ‘నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌ రెడ్డి ఇంటికి ఐకాన్‌ స్టార్‌, హీరో అల్లు అర్జున్‌ వస్తే.. ఎమ్మెల్యే అనుచరులు జనసేన జెండాలు పట్టుకుని తప్పుడు రాజకీయాలు చేస్తున్నారు. ఇది తగునా?. జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, ఆయన పార్టీ జెండాలు పట్టుకొని చీకటి రాజకీయాలు చేస్తున్నారు” అంటూ చంద్రబాబు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నంద్యాలకు రాగానే నాకు సెప్టెంబర్‌ 9వ తేదీ గుర్తుకు వస్తోంది. రాత్రి మీటింగ్‌ కంప్లీట్‌ చేసుకుని బస చేశాను. నిద్ర పోతున్నప్పుడు పోలీసులు దొంగల్లా వచ్చారు. నోటీసు ఇచ్చి అరెస్టు చేస్తున్నామని పోలీసులు చెప్పారు. నేను మాజీ ముఖ్యమంత్రిని ఏ కేసులో అరెస్ట్‌ చేస్తున్నారని అడిగాను. ఎఫ్‌ఐఆర్‌ ఇవ్వమని అడిగాను. దారిలో ఇస్తామని చెప్పి ఇక్కడ నుంచి తీసుకెళ్లారు. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పిన సీనియర్‌, మాజీ ముఖ్యమంత్రిని నన్నే అక్రమంగా అరెస్టు చేశారు. ఇక సామాన్యుల ఓ లెక్కా. జైల్లో నన్ను చంపేస్తానంటూ భయపెట్టారు. నన్ను చంపేస్తానంటే ఎవరి మెడకు వాళ్ళు ఉరేసుకుని చావాల్సి వస్తుంది జాగ్రత్త. నేను ఎప్పుడు ప్రాణానికి భయపడలేదు. రాష్ట్రంలో లా అండ్‌ ఆర్డర్‌ మెయిన్‌ టెన్‌ చేశాను. తిరుపతిలో నాపై క్లైమెర్‌ మెన్స్‌తో దాడి చేస్తే వెంకటేశ్వర స్వామి కాపాడారు” అని చంద్రబాబు అన్నారు.

2024-05-11 5:07:48 PM

చంద్రబాబు హామీల్లో ఒరిజినాలిటీ లేదు : బొత్స

ప్రజాశక్తి-విశాఖ : చంద్రబాబు హామీల్లో ఒరిజినాలిటీ లేదని… తమ పథకాలను కాపీ కొడుతున్నారనిమంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయబోమని ప్రధాని మోడీతో కూటమి చెప్పిస్తే గాజువాక నుండి అమర్‌, విశాఖ ఎంపీ పోటీ నుండి బొత్స ఝాన్సీ తప్పుకుంటారని సవాల్‌ చేశారు. ఎన్నికల్లో టీడీపీ కూటమి ఓడిపోతోందనే భయం, అసహనం చంద్రబాబులో పెరిగిపోతోందని విమర్శించాచరు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందకుండా చంద్రబాబు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. పేదలకు పథకాలు అందకుండా చేసి రాక్షసానందం పొందుతున్నారని చెప్పారు. తమది కుటుంబ పాలన అంటున్నారని… చంద్రబాబు కుటుంబం నుంచి ఐదుగురు పోటీ చేస్తున్నారని బొత్స అన్నారు. సీఎం జగన్‌ ను విమర్శించేంత స్థాయి నారా లోకేశ్‌ కు లేదని.. అడ్డ దారిలో పదవులు పొందిన వ్యక్తి నారా లోకేష్‌ అని ఎద్దేవా చేశారు. సర్వేలను తాను నమ్మనని చెప్పారు. తమ అధినేత జగన్‌ టార్గెట్‌ 175కి 175 అని అన్నారు.

2024-05-11  4:52:12 PM  

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే హామీలన్నీ నెరవేరుస్తాం : రాహుల్‌ గాంధీ 

కడప జిల్లా : కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే హామీలన్నీ నెరవేరుస్తాం అని కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ కడప ప్రజలకు పిలుపునిచ్చారు. శనివారం కడపలో నిర్వహించిన ఎన్నికల ప్రచార బహిరంగ సభలో రాహుల్‌ మాట్లాడుతూ … షర్మిల నా చెల్లి అన్నారు. వైఎస్‌ఆర్‌ కి జోహార్‌ అని నినదించారు. రాజకీయాల్లో కుటుంబ సంబంధాలుంటాయన్నారు. వైఎస్‌ఆర్‌ తన తండ్రికి సోదరుడు అని, రాజీవ్‌ , వైఎస్‌ఆర్‌ ఇద్దరు అన్న తమ్ముళ్లు అని, ఈ బంధం చాలా ఏళ్ళ క్రితం నుంచే ఉందని చెప్పారు. వైఎస్‌ఆర్‌ దేశానికి మార్గదర్శకులని, ఆయన పాదయాత్ర తనకు ఆదర్శం అని.. జోడో యాత్ర అందుకు స్ఫూర్తి అని అన్నారు. వైఎస్‌ఆర్‌ తనకు దేశం మొత్తం పాదయాత్ర చేయాలని చెప్పారని, తనకు అన్ని విషయాల్లో మార్గదర్శకులని, పాదయాత్ర చేస్తే ప్రజల్లోకి వెళతాం అని వైఎస్‌ఆర్‌ చెప్పారని, పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలు తెలుస్తాయని అన్నారని రాహుల్‌ స్మరించుకున్నారు. భారత్‌ జోడో ద్వారా ఈ దేశపు వీదులు తిరిగానన్నారు. వైఎస్‌ఆర్‌ సామాజిక న్యాయం కోసం రాజకీయం చేశారని అన్నారు. ఇప్పుడు ఏపిలో అది లేదని విమర్శించారు.

2024-05-11  4:40:55 PM

నియంతృత్వం నుంచి దేశాన్ని రక్షించండి : ఓటర్లకు కేజ్రీవాల్‌ పిలుపు

న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేయడంతో శుక్రవారం సాయంత్రం తీహార్‌ జైలు గేట్‌ 4 నుంచి కేజ్రీవాల్‌ బయటకు వచ్చారు. 50 రోజుల తరువాత జైలు నుంచి బయటకు కేజ్రీవాల్‌కు భార్య సునీతా కేజ్రీవాల్‌, అతిషి, సౌరభ్‌ భరద్వాజ్‌ వంటి ఆప్‌ నాయకులతో పాటు భారీ సంఖ్యలో ఉన్న ఆప్‌ కార్యకర్తలు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్‌ మాట్లాడుతూ నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

2024-05-11  4:37:43 PM

షర్మిలకు మద్దతుగా విజయమ్మ వీడియో

అమరావతి : పోలింగ్ సమయం దగ్గర పడుతున్న వేళ..  షర్మిలకు ఓటు వేసి గెలిపించాలని వైఎస్‌ విజయమ్మ కడప ఓటర్లను కోరుతూ.. వీడియో సందేశాన్ని విడుదల చేశారు. విజయమ్మ మాట్లాడుతూ.. ”వైఎస్‌ను అభిమానించే వారికి, ప్రేమించే వారికి నా హృదయ పూర్వక నమస్కారాలు.. కడప ప్రజలకు నా విన్నపం.. వైఎస్‌ బిడ్డ షర్మిలమ్మ ఎంపీ గా పోటీ చేస్తుంది.. వైఎస్‌ బిడ్డను గెలిపించి పార్లమెంట్‌కి పంపాలని మిమ్మల్ని ప్రార్థిస్తున్నా” అని తెలిపారు.

2024-05-11  4:21:41 PM

సిపిఎం అభ్యర్థులను గెలిపించాలని బైక్‌ ర్యాలీ

రాజవొమ్మంగి (అల్లూరి) : ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే సిపిఎం అభ్యర్థులను గెలిపించాలని సిపిఎం మండల నాయకులు లాగరాయి, రాజవొమ్మంగి, శరభవరం, బోర్నగూడెం, ఉర్లాకులపాడు, సంజీవనగరం, చెరుకుంపాలెం, జడ్డంగి, వట్టిగెడ్డ, సింగంపల్లి, దూసరపాము తదితర గ్రామాల్లో బైక్‌ ర్యాలీ నిర్వహించారు.