అన్నీ తానై

Jun 30,2024 09:35 #kavithalu, #Sneha

నది తనలోకి తాను ముడుచుకున్నట్టు
మంచంపై సోలిపోతుంది
ఆమింక ఈ రోజుకు
సరైన విశ్రాంతి కోరుకుంటోంది
పటంపై చంద్రరేఖ మెరుస్తుండగా..
విశాలమైన ఆమె నిద్ర గదిలో
అదాటుగా సంచరిస్తూ
మార్దవమైన దీపకాంతిని ఒలకబోసాను
మెత్తటి చూపుతో కలవరించిందామె
దినమంతా అలసిన
ఆ చెంపలను నిమిరాను లాలనగా..
ఎన్నిసార్లు స్వర్గం లోతుల్లోకి వెళ్లినా..
ఆమె కాలి చిటికెన వేలి దగ్గరే మూర్ఛనలు
ఈ సంవేదనలకి ఇంకెంతలే ఆయువు
మహా అయితే-
ఏ పది, పదిహేనేళ్లో!
అంతవరకు..
శిథిల దృశ్యాల్లో చెల్లాచెదురైన
మనల్ని మనం..
కూడదీసుకుంటూనే వుందాం అన్నా!
అభయహస్తం చూపిందామె..

దేశరాజు
9948680009

➡️