నిజాయితీ చేసిన మేలు

Jun 16,2024 11:32 #Sneha

ఒక ఊళ్లో ఒక పేదవాడు కట్టెలుకొట్టి, అమ్ముకుంటూ నిజాయితీగా కష్టపడి బతికేవాడు. ఒక రోజు అతడు నది దగ్గర కట్టెలు కొడుతుండగా, చేతిలోని ఇనుప గొడ్డలి జారి నదిలోపడి, ప్రవాహంలో కొట్టుకుపోయింది. జీవనాధారమైన ఒక్క గొడ్డలీ పోవడంతో అతడు నది వొడ్డున కూర్చొని ఏడుస్తాడు. అది విన్న నదీ దేవత ప్రత్యక్షమై ‘ఏమైంది బిడ్డా? ఎందుకు ఏడుస్తున్నావు?’ అని అడిగింది. ఆ పేదవాడు జరిగిందంతా చెప్పాడు. వెంటనే ఆ దేవత నదిలో నుంచి ఒక బంగారు గొడ్డలిని తీసి, ‘ఇదేనా నీ గొడ్డలి’ అని అడిగింది. ‘అది నాది కాదు తల్లీ’ అని చెప్పాడు. తర్వాత దేవత ఒక వెండిగొడ్డలిని తీసి ‘ఇదా నీ గొడ్డలి’ అని అడిగింది. అతడు కాదని సమాధానం చెప్పాడు. ఈ సారి దేవత అతడు నదిలో పారేసుకున్న ఇనుపగొడ్డలిని తీసి ‘ఇదేనా’ అని అడిగింది. అది చూసి అతడు ఆనందంతో ‘ఇదేనమ్మా నా గొడ్డలి’ అని బదులిచ్చాడు. అతడి నిజాయితీని నదీ దేవతో ఎంతగానో మెచ్చుకుంటుంది. ఇనుప గొడ్డలితోపాటూ, బంగారపు గొడ్డలిని, వెండి గొడ్డలిని కూడా అతడికి బహుకరించి, ఆశీర్వదిస్తుంది.
నీతి : నిజాయితీ మనకెంతో మేలు చేస్తుంది.

టి.సేసాక్షి,
9వతరగతి, విశాఖపట్నం -27,
బుచ్చిరాజుపాలెం.

➡️