భూమి ఎలా ఏర్పడింది?

Nov 13,2023 16:39 #Environment, #Sneha, #Stories

అనగనగా ఒక అడవిలో ఒక పావురం, పిచ్చుక ఉండేవి. ఇవి రెండూ మంచి మిత్రులు. వాళ్లిద్దరికీ ఏమి తెలిసినా ఒకరికొకరు చెప్పుకుంటాయి.
అయితే ఒకరోజు పావురం, పిచ్చుక దగ్గరికి వచ్చి, ‘పిచ్చుకా! నీకు ఒక విషయాన్ని చెప్పాలి’ అంది.
‘ఏమిటా విషయం చెప్పు చెప్పు..’ అంటూ పిచ్చుక తొందర చేసింది.
‘తొందర పడకు చెబుతాను విను.. మన భూమి గురించి నీకు తెలుసా? నాకు తెలుసు. నీకు ఇప్పుడు ఆ భూమి ఎలా ఏర్పడింది అనే విషయాన్నే చెబుతాను’ అంది పావురం.
‘చెప్పు చెప్పు నాకు చాలా ఇంట్రెస్ట్‌గా ఉంది..’ అంది పిచ్చుక.’సరే చెబుతాను విను. సూర్యుడు పుట్టిన తర్వాత మిగిలిపోయిన పదార్థాలు అంటే పెద్ద పెద్ద రాళ్ళు.. దాని చుట్టూ ఉన్న గేస్‌నె. అంటే సూర్యుడి నుండి కొంత భాగం వాటిని కలుపుకొని మండుతూ విడిపోయింది. అదే మన భూమి. కొన్ని లక్షల సంవత్సరాల క్రితం మన భూమి కూడా నరకంగా ఉండేది. భూమిలో లావా చాలా ఎక్కువగా ఉండేది. భూమిలో ఎంత వేడి ఉండేదంటే వెయ్యి డిగ్రీల సెంటీగ్రేడ్‌లో ఉండేది. అప్పుడు భూమి ఎంత వేగంగా తిరిగేది అంటే రోజుకు ఆరు గంటలు మాత్రమే ఉండేది. ఒకరోజు మాస్‌లాంటి పెద్ద గ్రహం వచ్చి గట్టిగా ఢకొీట్టింది. గ్రహం గట్టిగా ఢకొీట్టడం వల్ల భూమిలో కొంతభాగం వేరైంది. అది ఒక గ్రహంగా మారింది. అదే మన మూన్‌. అయితే మూన్‌, భూమికి చాలా దగ్గరగా ఉండేది. ఎంత అంటే మూన్‌ భూమికి కొన్ని లక్షల దూరంలో ఉంది. గ్రహం ఢకొీట్టడం వల్ల భూమి కొంచెం అడ్డంగా ఉండి తిరుగుతుంది. అలా తిరగడం వల్ల మనకి వింటర్‌, రెయినీ, సమ్మర్‌ అనే ఋతువులు వచ్చాయి. మూన్‌ భూమికి దగ్గరగా ఉండటం వల్ల దాని చల్లదనానికి భూమిలో ఉన్న లావా అంతా నల్ల మట్టిగా మారింది. అయితే మానవుడు బతకాలంటే నీరు అవసరం. భూమి మీదకి నీరు ఎలా వచ్చింది అంటే.. మండుతున్న భూశకలం వేడికి వాతావరణంలోని దుమ్ము, ధూళి, నీటి అణువులు ఆవిరయ్యేవి. అవి ఘనీభవించి వర్షం రూపంలో నీరు ఏర్పడింది.
భూమిలోకి అంత నీరు రావడానికి 200 కోట్ల సంవత్సరాలు పట్టాయి. భూమి మీద ఉన్న వేడికి నీరు ఆవిరై మేఘాలుగా మారాయి. మేఘాల నుండి వర్షాలు పడి సముద్రంగా మారింది. మూన్‌, భూమికి దగ్గరగా ఉండటం వల్ల సముద్రంలో అలలు ఎగిసిపడుతుండేవి. మూన్‌ కూడా సూర్యుడు చుట్టూ తిరిగే ఒక గ్రహంగా మారవచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. (మిగిలిపోయిన బ్యాక్టీరియాలు, నీరు, న్యూట్రాన్స్‌ ఇవన్నీ కలిసి ఒక జీవిగా మారాయి. నీరు కొండలోపలికి వెళ్లి పొగగా బయటకు వస్తుండేవి. అక్కడే మొదటి జీవి పుట్టిందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. భూమి సూర్యుడి నుండి సరైన దూరంలో ఉండటం వల్ల జీవి బతికే అవకాశం ఉంది. దాని నుంచి వెనుకకు వెళితే గడ్డ కట్టుకుపోతారు. దాని ముందుకు వెళితే వేడికి జీవి బతకలేదు. మనం ఎంతో అదృష్టవంతులం. ఆ జీవి కార్బన్‌ డై ఆక్సైడ్‌ను పీల్చుకొని, భూమి మీద జీవులు బతకడానికి అంతా సిద్దమైంది. ఆ జీవి నుండి అలా జీవులు పుట్టడం ప్రారంభమయ్యాయి.) ఆ తర్వాత భూమి అలా అలా అభివృద్ధి చెందింది’ అంటూ ముగించింది పావురం.
‘భలే భలే.. భూమి గురించి ఇన్ని విషయాలు ఉన్నాయని నాకు తెలియనే తెలియదు.. బోలెడన్ని విషయాలు చెప్పినందుకు థాంక్స్‌ నీకు’ అంది పిచ్చుక.

వి. జయప్రసాద్‌,
8వ తరగతి బి
ఎన్‌.ఎం.సి. హైస్కూల్‌, విశాఖ.

➡️