జ్ఞాపకాల లేపనం..

Mar 24,2024 09:02 #Poetry, #Sneha

దర్వాజా వెలుగు.. తీయటి కన్నీరు
చిరునవ్వంటే.. ఏంటో అడుగు
చివురించే మోడు చెప్తుంది!
దుఃఖం పొంగుకొస్తోంది!
నువ్వు.. ఖాళీ చేసిన మనసు
తానాక్రమించాలని!
నీ జ్ఞాపకం !
చీకట్లో కూడా వెంటాడే నీడ!!
కలల్ని ఆపడమంటే
అలల్ని ఒడ్డుకు రావద్దనడమే!!
నవ్వుతూ.. నవ్వించడంవల్ల
వచ్చిందేమో..
కన్నీరు తియ్యగుంది!!
జ్ఞాపకాల – లేపనాలే
మది గాయాలకి!!
కథలు పుట్టుకొస్తున్నాయి
జీవితసారాన్ని కలంలో
సిరాగా నింపానుగా!!

– తరిగొప్పుల విఎల్‌ ఎన్‌ మూర్తి, 8008577834

➡️