పాలకుడే అర్చకుడు

Jan 14,2024 07:57 #Poetry
poetry on pm modi role in ram mandir

వచ్చేశాయ్ వచ్చేశాయ్

అయోధ్య అక్షింతల్‌

ఇక శుభమే శుభం

ధరలు, ఉపాధి వద్దే వద్దు

సహనం, నీతి రద్దే రద్దు

రామ రాజ్యం అసలే వద్దు,

నమో జపంతో కడుపు నిండె

పాలకుడే అర్చకుడయ్యె

దేముడు రాజకీయ మయ్యె

గుడి ఎన్నికల అస్త్రమయ్యె

గెలుపుకు బ్రహ్మాస్త్రమయ్యె,

సనాతనంలో

పూజారే విగ్రహ ప్రతిష్ట

రాజు పాలకుడే,

అధునాతనంలో

సర్వం నమో

అహం బ్రహ్మోస్మి.

– ఎ. అజ శర్మ

➡️