ప్రశ్నలు

Jun 30,2024 09:38 #kavithalu, #Sneha

రాలిన ఆకు
నేలను తాకి
మౌనాన్ని ద్రవించినట్లు,
గట్టు తెగి
ఊరు
ఊరేగుతున్నట్లు,
చిగురాకు
సుతారంగా
కిరణ మొనల్ని తడిమినట్లు,
పనిముట్లు
ఆరుబయట
చలి కాచుకుంటున్నట్లు,
కళ్లెం లేని వేగం
ఊపిరితో
పరాచికాలాడినట్లు,
అన్నీ
అమ్మకానికి పెట్టి
నమ్మకానికి రంగులద్దుతున్నట్లు,
కథే లేని సినిమాలో
తైతక్కలు,
కేరింతలు కొట్టినట్లు,
కరోనా
వల్లకాడులో
కడ చూపుకు గంతలు కట్టినట్టు
కొన్ని ప్రశ్నలు …
అమృత వనంలో
మృతదేహాల్లా భయపెడుతుంటాయి ! !

– చల్లా విశ్వనాథం,
9392825427

➡️