ఆరోగ్యానికి ఆకుకూరలు

Mar 23,2024 05:44 #Jeevana Stories

ఆకుకూరలు … చౌకగా లభ్యమయ్యే మంచి పోషక విలువలు కలిగిన ఆహారం. తోటకూర, చుక్కకూర, బచ్చలికూర, పొన్నగంటికూర, గోంగూర, మెంతికూర, చేమ, ముల్లంగి ఆకులు … ఇలా ఎన్నో రకాల ఆకులు అందుబాటులో ఉన్నాయి.

ఎండాకాలంలో ఆకుకూరలు తింటే తేలిగ్గా జీర్ణమై పోషకాలను అందిస్తాయి. రోగ నిరోధకశక్తిని పెంచుతాయి. రోజూ వంద గ్రాముల ఆకుకూరలు ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. శరీరానికి అవసరమయ్యే సూక్ష్మ పోషకాలు ఆకుకూరల్లో మెండుగా ఉంటాయి. మాంసకృత్తులు, ఒమెగా 3 కొవ్వులు, విటమిన్‌ ఇ పుష్కలంగా ఉండే ఆకుకూరలు రోగ నిరోధకతను పెంచటంలో దోహదపడతాయి. వీటిలో ఫోలిక్‌ యాసిడ్‌ కూడా ఎక్కువగా ఉంటుంది. వీటిని తీసుకుంటే రక్తహీనత సమస్య రాదు. తోటకూర, గోంగూర, కరివేపాకులలో ఎక్కువ మొత్తంలో పీచు లభిస్తుంది. దాంతో ఆహారం చక్కగా జీర్ణమై మలబద్ధకం సమస్య ఉండదు. అధిక రక్తపోటుతో బాధపడేవారికి ఆకుకూరలు మేలు చేస్తాయి. ఆకుకూరల్లో ఉండే ల్యూటిన్‌, కెరోటిన్‌ యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేసి క్యాన్సర్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తాయి. ఆకుకూరలను నీటిలో శుభ్రంగా కడిగి తడి పోయేలా తుడిచి, ఆరబెట్టుకోవాలి. టిష్యూ పేపర్‌ లేదా మందమైన వస్త్రంలో చుట్టి పెట్టుకోవచ్చు. వేర్లతో నిల్వ చేస్తే త్వరగా పాడవుతాయి. కడిగేటప్పుడు ఎక్కువ సేపు నీటిలో ఉంచకూడదు.

➡️