నడకతోనే ఆరోగ్యం

Dec 26,2023 10:11 #feature

ప్రతి ఒక్కరూ తమ జీవితాన్ని బిజీ బిజీగా గడుపుతుంటారు. ఈ ఉరుకులు, పరుగుల జీవితంలో కాస్త సమయం కేటాయించి నడక ప్రారంభిస్తే క్రమేణా అనారోగ్య సమస్యలు కూడా తగ్గిపోతాయి. ‘నడకే మనిషికి మంచి ఆరోగ్యం’ అని పెద్దలు అంటుంటారు. వ్యాయామం చేసినా, ఆటలు ఆడినా, నడక నడిచినా, పరుగెత్తినా ఎంతోకొంత ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అయితే ఇది క్రమం తప్పకుండా ప్రతిరోజూ ఉదయమో, సాయంత్రమో జరగాల్సివుంది. తర్వాత శరీరంలో ఉండే కొవ్వు, ఇతర వ్యర్థాలు కొంతమేరకు చెమట రూపంలో పోతాయి. తద్వారా శరీరం దృఢంగానూ, ఆరోగ్యం మెరుగ్గానూ మారుతుంది. ఎక్సర్‌సైజుల్లో నడకను మించిన తేలికపాటి వ్యాయామం మరొకటి లేదు. ఏ వయస్సు వారైనా ఎప్పుడైనా ఎక్కడైనా నడకను కొనసాగించొచ్చు. దీనికోసం పైసా ఖరుచ పెట్టనక్కరలేదు. మిగతా వ్యాయామాల కన్నా సురక్షితం కూడా. నడక వల్ల బరువు తగ్గటంతోపాటు ఎన్నో ఉపయోగాలు, మరెన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

మానసిక ఆరోగ్యం : ప్రతిరోజూ నడవటం వల్ల శరీరంలో ఉండే ఎండార్ఫిన్లు అనే హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్‌, కంగారు వంటి సమస్యలు తగ్గుతాయి. వయస్సు మీద పడటం వల్ల వచ్చే డెమన్షియా, అల్జీమర్స్‌ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి.

కంటి వ్యాధులు దూరం : కంటికి సంబంధించిన పలు నాడులు కాళ్లలో ఉంటాయి. అందుకనే కాళ్లతో నడవటం వల్ల కంటి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. నిత్యం నడక సాగించటం వల్ల కళ్లపై అధిక ఒత్తిడి తగ్గటంతోపాటు గ్లకోమా వంటి కంటి వ్యాధులు రాకుండా ఉంటాయి.

రక్తం సరఫరాలో మెరుగుదల : ప్రతిరోజూ నడిచినా, పరుగెత్తినా గుండె సమస్యలు తగ్గుతాయి. గుండెపోట్లు వంటివి రావు. హైబీపీ, కొలెస్ట్రాల్‌ వంటివి కూడా తగ్గుముఖం పడతాయి. శరీరంలో రక్త సరఫరా మెరుగుపడుతుంది.

ఊపిరితిత్తుల సమస్యలు మాయం : నడవటం వల్ల శరీరం ఆక్సిజన్‌ను ఎక్కువగా గ్రహిస్తుంది. అదే ఆక్సిజన్‌ రక్తంలో చేరి ఊపిరితిత్తులకు చేరి శరీరం ఆక్సిజన్‌ను గ్రహిస్తుంది. ఆక్సిజన్‌ ఊపిరితిత్తుల్లో ఉండే టాక్సిన్లు, విష, వ్యర్థ పదార్థాలను బయటకు పంపుతుంది. ఇతర ఊపిరితిత్తుల సమస్యలు కూడా దూరమవుతాయి.

మధుమేహం నియంత్రణ : మధుమేహం ఉన్న వారు నిత్యం నడిస్తే చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఆరునెలలపాటు క్రమం తప్పకుండా నడక లేదా పరుగు చేసిన కొందరు మధుమేహ రోగులను పరిశీలించగా వారి రక్తం స్థాయిలో గ్లూకోజ్‌ స్థాయిలో బాగా అదుపులోకి వచ్చినట్లుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. అందువల్ల రోజూ నడిస్తే మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవచ్చు.

జీర్ణప్రకియలో మెరుగుదల : ప్రతిరోజూ కనీసం 30 నిముషాలపాటు నడిస్తే పెద్ద పేగు క్యాన్సర్‌ వచ్చే ముప్పుచాలా తగ్గుతుంది. జీర్ణప్రకియ మెరుగుపడుతుంది. మలబద్ధకం పోతుంది. విరేచ నం రోజూ సాఫీగా అవుతుంది. ప్రతిరోజూ 100 నిముషాల పాటు వాకింగ్‌ చేస్తే అధిక బరువు నుంచి కొంతవరకు తగ్గుతారని పరిశోధనలు తెలియజేస్తు న్నాయి. కండరాలు కూడా దృఢంగా మారుతాయి.

ఎముకల్లో సాంద్రత పెరుగుదల : ప్రతిరోజూ నడవటం వల్ల కీళ్లు బాగా పనిచేస్తాయి. త్వరగా అవి అరిగిపోవటం జరగదు. ఎముకల్లో సాంద్రత కూడా పెరుగుతుంది. ఫ్రాక్చర్లు, కీళ్ల నొప్పులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. దీనికోసం రోజూ కనీసం 30 నిముషాలపాటైనా నడవాలి. ఇలా చేస్తే కీళ్ల నొప్పులు, వాపులు కూడా తగ్గుతాయి.

ఊబకాయం నుంచి విముక్తి : మారిన జీవన విధానం, ఆహారపు అలవాట్లు ఊబకాయానికి దారితీస్తు న్నాయి. చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వారి వరకూ దీని బారిన పడుతున్నారు. బరువు తగ్గించుకోవటానికి మించిన వ్యాయామం లేదు. ఒక పౌండు బరువు పెరగ టం అంటే అదనంగా 3500 క్యాలరీలు శరీరంలో వచ్చి చేరాయన్న మాటే. ప్రతిరోజూ క్రమం తప్పకుండా నడిస్తే వారంలో ఒక పౌండు బరువు తగ్గే అవకాశం ఉంది.

➡️