పెరిగిన దేశం అప్పు- 2019 నుంచి రూ.82 లక్షల కోట్లు పెరుగుదల

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :మోడీ ప్రభుత్వంలో అప్పు విపరీతంగా పెరుగుతోంది. ఆరేళ్లలోనే దాదాపు రూ.82 లక్షల కోట్లు పెరిగింది. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ గురువారం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం అప్పులు వెల్లడయ్యాయి. 2024 మార్చి 31 నాటికి రూ.168,72,554.16 కోట్లు అప్పు ఉంటే, 2025 మార్చి 31 నాటికి అది కాస్తా రూ.183,67,132.46 కోట్లకు పెరుగుతుందని అంచనా వేసింది. అంటే ఏడాదిలోనే రూ.14,94,577.85 కోట్ల అప్పు పెరుగుతుందని ప్రభుత్వ బడ్జెట్‌ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. 2019-20లో రూ.101,98,173.64 కోట్ల అప్పు ఉంటే, అది కాస్తా 2024-25 నాటికి రూ.183,67,132.46 కోట్లకు పెరుగుతుంది. అంటే, రూ.81,68,958.81 కోట్లకు అప్పు పెరగనుంది.

2024 మార్చి 31 నాటికి అప్పు

దేశీయ అప్పు : రూ.163,35,070.06 కోట్లు

విదేశీ అప్పు : రూ.5,37,484.10 కోట్లు

మొత్తం అప్పు: రూ.168,72,554.16 కోట్లు

2025 మార్చి 31 నాటికి అప్పు

దేశీయ అప్పు : రూ.177,92,204.95 కోట్లు

విదేశీ అప్పు : రూ.5,74,927.51 కోట్లు

మొత్తం అప్పు : రూ.183,67,132.46 కోట్లు

2019లోపెరిగిన అప్పుల వివరాలు      ఏడాది అప్పు (రూ.కోట్లల్లో)

2019-20                                       రూ.101,98, 173.6420

20-21                                           రూ.120,58, 987.40

2021-22                                      రూ.135,45,605.78

2022-23                                    రూ. 152,23,605.78

2023-24                                   రూ.168,72,554.16

2024-25                                     రూ.183,67,132.46

➡️