పశు సంపదకూ బకాయిలే

May 1,2024 01:12 #Pasusampada
  •  నాలుగేళ్లుగా తిప్పుతున్న ఆర్థికశాఖ

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి : పశుసంపద అభివృద్ధి కోసం అనేక రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసిన పశువులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం బకాయిలు పడిపోయింది. ఎన్నో సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలతో చేసుకున్న ఒప్పందాల మేరకు కోట్లాది రూపాయల విలువైన పశుసంపదను కొనుగోలు చేసి రాష్ట్రానికి తీసుకువచ్చారు. 2018 నుంచి 2020 మధ్య కాలంలో జరిగిన ఈ ఒప్పందాలకు సంబంధిరచిన నిధులను విడుదల చేయకపోవడంతో పశువులను సరఫరా చేసిన వారు న్యాయస్థానం మెట్లు ఎక్కారు. ఇతర రాష్ట్రాల నుంచి జంతువులను కొనుగోలు చేసి రాష్ట్రంలో అభివృద్ధి చేసేందుకు 2018లో యానిమల్‌ ఇరడక్షన్‌ పాలసీని ప్రభుత్వం తీసుకువచ్చింది. ఎస్‌సి,ఎస్‌టి బిసి, కాపు, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా జంతు పెంపకాన్ని ప్రోత్సాహించాలని నిర్ణయించారు. అవులు, గేదెలు, గొర్రెలు వంటి వాటిని కొనుగోలు చేశారు. అయ్యప్ప ఎంటర్‌ప్రైజెస్‌, భారత్‌ లైవ్‌స్టాక్‌ ఏజెన్సీ, ఖురానా డెయిరీ ఫామ్‌, విఘ్నేశ్వర ఏజెన్సీస్‌ వంటి సంస్థల నురచి రాష్ట్రంలోని 13 కార్పొరేషన్లు ఈ పశు సంపదను కొనుగోలు చేశాయి. ఈ కొనుగోళ్లకు సంబంధించి 21.54 కోట్ల రూపాయలను చెల్లించాల్సి ఉన్నప్పటికీ ఆర్థికశాఖ ఇప్పటివరకు ఈ నిధులను చెల్లించలేదు. దీనిపై 2022లోనే ఆయా సంస్థలు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. ఈ నిధులను విడుదల చేస్తే కోర్టు నురచి మొట్టికాయలు తప్పించుకోవచ్చునని అధికారులు అంటున్నారు.

➡️