అల్కరాజ్‌ జోరుకు జ్వెరేవ్‌ బ్రేక్‌

Jan 24,2024 22:18 #Sports
  • సెమీస్‌లో మెద్వదెవ్‌తో డీ
  • ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌లో అల్కరాజ్‌ జోరుకు క్వార్టర్‌ఫైనల్లో బ్రేక్‌ పడింది. టైటిల్‌ లక్ష్యంగా బరిలోకి దిగిన 2వ సీడ్‌, స్పెయిన్‌ యువ సంచలనం అల్కరాజ్‌.. జర్మనీకి చెందిన 4వ సీడ్‌ జ్వెరేవ్‌ చేతిలో అనూహ్యంగా ఓటమిపాలయ్యాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ చివరి క్వార్టర్‌ఫైనల్లో అల్కరాజ్‌ 1-6, 3-6, 6-7(2-7), 4-6తో 6వ సీడ్‌ జ్వెరేవ్‌(జర్మనీ) చేతిలో ఓడాడు. దీంతో జ్వెరేవ్‌తోపాటు 4వ సీడ్‌, రష్యాకు చెందిన మెద్వదెవ్‌ సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. ఇక మెద్వదెవ్‌ ఐదుసెట్ల హోరాహోరీ పోరులో 9వ సీడ్‌ హుర్క్‌రాజ్‌(పోలండ్‌)ను చిత్తుచేశాడు. ఉత్కంఠభరితంగా సాగిన క్వార్టర్‌ఫైనల్లో మెద్వదెవ్‌ 7-6(7-4), 2-6, 6-3, 5-7, 6-4తో హుర్క్‌రాజ్‌ను ఓడించాడు.తొలిసారి సెమీస్‌కు జంగ్‌, యాస్టెమ్య్సా… ఇక మహిళల సింగిల్స్‌ సెమీఫైనల్లోకి 12వ సీడ్‌, చైనాకు చెందిన క్యూ. జెంగ్‌, అన్‌సీడెడ్‌, ఉక్రెయిన్‌కు చెందిన యాస్టెమ్య్సా తొలిసారి ప్రవేశించారు. బుధవారం జరిగిన క్వార్టర్‌ఫైనల్లో యాస్టెమ్య్సా 6ా3, 6ా4తో చెక్‌ రిపబ్లిక్‌కు చెందిన నొస్కావాను వరుససెట్లలో చిత్తుచేసింది. ఇక 12వ సీడ్‌ జెంగ్‌ 6-7(4-7), 6-3, 6-1తో కలిన్స్కయా(రష్యా)ను చిత్తుచేసింది. తొలి సెట్‌ను టై బ్రేక్‌లో చేజిక్కించుకున్న జంగ్‌.. ఆ తర్వాత రెండు సెట్‌లలోనూ అద్భుతంగా పుంజుకొని మ్యాచ్‌ను ముగించడం విశేషం. 43ఏళ్ల వయసులో బప్పన్నకు టాప్‌ర్యాంక్‌ భారత డబుల్స్‌ స్పెషలిస్ట్‌ రోహన్‌ బప్పన్న ఓ రికార్డును తన పేర లిఖించుకోవడంతోపాటు ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ సెమీఫైనల్‌కు చేరాడు. బుధవారం జరిగిన పురుషుల డబుల్స్‌ క్వార్టర్‌ఫైనల్లో 2వ సీడ్‌గా బరిలోకి దిగిన రోహన్‌ బప్పన్నాఎబ్డెన్‌(ఆస్ట్రేలియా) జోడీ 6-4, 7-5(7-5)తో 5వ సీడ్‌ అర్జెంటీనా జంటను చిత్తుచేశారు. దీంతో సెమీస్‌కు చేరడంతో పాటు రోహన్‌ బప్పన్న 43ఏళ్ల వయసులో ప్రపంచ ర్యాంకింగ్స్‌లోనూ అగ్రస్థానానికి ఎగబాకాడు. ఈ క్రమంలో అత్యధిక వయసులో టాప్‌ర్యాంక్‌కు చేరిన ఓ టెన్నిస్‌ ఆటగానిగా భారత్‌కు చెందిన రోహన్‌ బప్పన్న రికార్డు పుటల్లోకెక్కాడు. సెమీస్‌లో బప్పన్న జోడీ జంగ్‌(చైనా)-మచాక్‌(చెక్‌)లతో తలపడనున్నారు.

మహిళల సింగిల్స్‌ సెమీఫైనల్స్‌…

గాఫ్‌ × సబలెంకాయాస్టెమ్స్యా × జెంగ్‌

(మధ్యాహ్నం 2.00గం||లకు సోనీలో)

➡️