ఐపిఎల్‌ వేడుకలు అదుర్స్‌…

Mar 23,2024 10:19 #Sports
  • అలరించిన బాలీవుడ్‌ స్టార్‌ అక్షయ్ కుమార్‌ విన్యాసం
  • ఎఆర్‌ రెహమాన్‌, సోను నిగమ్‌, టైగర్‌ ష్రాఫ్‌ ప్రదర్శనలు కూడా..

చెన్నై: ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌(ఐపిఎల్‌)-2024 ఆరంభ వేడుకలు ఎంఎ చిదంబరం(చెపాక్‌) స్టేడియంలో శుక్రవారం అట్టహాసంగా జరిగాయి. ప్రారంభోత్సవ వేడుకల్లో బాలీవుడ్‌ స్టార్స్‌ అక్షయ్ కుమార్‌, టైగర్‌ ష్రాఫ్‌ చేసిన ప్రదర్శలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. తొలుత జాతీయ జెండాతో అక్షరు కుమార్‌ గ్రాండ్‌ ఎంట్రీతో ఈ వేడుకలు మొదలయ్యాయి. ప్రముఖ సంగీత దర్శకుడు ఎఆర్‌ రెహమాన్‌ పాడిన ‘మా తుఝే సలామ్‌’ పాటకు గ్యాలరీలో కూర్చున్న ప్రేక్షకులంతా స్వరం కలుపగా.. సింగర్‌ సోనూ నిగమ్‌ పాడిన దేశభక్తి పాటలు అభిమానులను ఉత్సాహరిచారు. అనంతరం వేదికపైకి చెన్నై నూతన సారథి రుతురాజ్‌ గైక్వాడ్‌ ఐపిఎల్‌ సీజన్‌-17 ట్రోఫీని తీసుకొచ్చాడు. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్సీబీ) కెప్టెన్‌ డుప్లెసిస్‌, బిసిసిఐ అధ్యక్షుడు రోజర్‌ బిన్నీ, కార్యదర్శి జే షా, లీగ్‌ ఛైర్మన్‌ అరుణ్‌ ధుపాల్‌, ఉపాధ్యక్షులు రాజీవ్‌ శుక్లా తదితరులు హాజరయ్యారు.

➡️