కర్ణాటక రంజీ కెప్టెన్‌గా మయాంక్‌

Dec 28,2023 22:05 #Sports

బెంగళూరు: కర్ణాటక జట్టు రంజీట్రోఫీ కెప్టెన్‌గా మయాంక్‌ అగర్వాల్‌ ఎంపికయ్యాడు. కర్ణాటక క్రికెట్‌బోర్డు గురువారం ప్రకటించిన 16మంది ఆటగాళ్ల జాబితాలో స్టార్‌ బ్యాటర్‌ కెఎల్‌ రాహుల్‌కు చోటు దక్కలేదు. జనవరి, ఫిబ్రవరిలో భారతజట్టు ఆఫ్ఘనిస్తాన్‌తో మూడు టి20ల సిరీస్‌, ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌ ఆడనున్న దృష్ట్యా కెఎల్‌ రాహుల్‌ పేరును పరిశీలించలేదని కర్ణాటక క్రికెట్‌బోర్డు ఆ ప్రకటనలో వెల్లడించింది. 2024 రంజీట్రోఫీ సీజన్‌లో కర్ణాటక జట్టు తొలి రెండు మ్యాచ్‌లను పంజాబ్‌, గుజరాత్‌లతో తలపడనుంది. అలాగే ప్రసిధ్‌ కృష్ణ అంతర్జాతీయ క్రికెట్‌లో బిజీ ఉన్న కారణంగా అతడి పేరును ప్రకటించలేదు. జట్టు: మయాంక్‌ అగర్వాల్‌(కెప్టెన్‌), సమర్థ్‌, పడిక్కల్‌, నికిన్‌ జోష్‌(వైస్‌ కెప్టెన్‌), మనీష్‌ పాండే, శుభాంగ్‌ హెడ్జే, శరత్‌ శ్రీనివాస్‌, వ్యాసక్‌, కౌశిక్‌, కావేరప్ప, శశికుమార్‌, సుజరు సతేరి, నిశ్చల్‌, వెంకటేశ్‌, కిషన్‌ బెడారే, రోహిత్‌ కుమార్‌. కోచ్‌: పివి శశికాంత్‌, బౌలింగ్‌ కోచ్‌: మన్సూర్‌ అలీ ఖాన్‌, ఫీల్డింగ్‌ కోచ్‌: శబరీశ్‌ మోహన్‌.

➡️