కోహ్లి తిరుగు పయనం..టెస్ట్‌ సిరీస్‌కు దూరం

Dec 22,2023 22:18 #Sports

జహన్నెస్‌బర్గ్‌: దక్షిణాఫ్రికాతో టెస్ట్‌ సిరీస్‌కు ముందు టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి వ్యక్తిగత కారణా రీత్యా భారత్‌కు తిరుగు పయనమైనట్లు బిసిసిఐ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొంది. కోహ్లి తిరుగు ప్రయాణానికి గల కారణాలను ఆ ప్రకటనలో వెల్లడించలేదు. దక్షిణాఫ్రికా పర్యనటకు బిసిసిఐ మూడు ఫార్మాట్‌లకు మూడు వేర్వేరు జట్లను ప్రకటించగా.. కోహ్లికి టెస్టుల్లో మాత్రమే ఆడేందుకు చోటు దక్కింది. మంగళవారం నుంచి తొలిటెస్ట్‌ ప్రారంభం కానునండగా.. ఇటీవల దక్షిణాఫ్రికాకు పయనమై వెళ్లాడు. అలాగే రుతురాజ్‌ గైక్వాడ్‌ వేలికి గాయం కావడంతో అతడూ టెస్ట్‌ సిరీస్‌కు దూరమయ్యాడు. ఈ టెస్ట్‌ సిరీస్‌లో నెగ్గితే భారత్‌కు ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌(డబ్ల్యుటిసి)కు పాయింట్లు జమ కానున్నాయి. దీంతో భారత్‌కు ఈ సిరీస్‌ గెలుపు తప్పనిసరి. దక్షిణాఫ్రికాతో రెండు టెస్ట్‌ మ్యాచ్‌ల సిరీస్‌ డిసెంబర్‌ 26న సూపర్‌స్పోర్ట్‌ పార్క్‌ వేదికగా ప్రారంభం కానుంది.

➡️