క్వార్టర్స్‌కు ట్రీసా-గాయత్రి

Feb 1,2024 22:15 #Sports

థాయ్ లాండ్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ

బ్యాంకాక్‌: థాయ్ లాండ్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ మహిళల డబుల్స్‌ క్వార్టర్‌ఫైనల్లోకి భారతజంట ట్రీసా జోలీ-గాయత్రీ గోపీచంద్‌ ప్రదేశించింది. గురువారం జరిగిన మహిళల డబుల్స్‌ ప్రి క్వార్టర్స్‌ఫైనల్లో త్రీసా జోలీ-గాయత్రి జంట 21-15, 24-22తో భారత్‌కే చెందిన తానీషా క్రాస్టో-అశ్విని పొన్నప్పలను చిత్తుచేశారు. ఇక పురుషుల సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్‌ పోరాటం ముగిసింది. ప్రి క్వార్టర్స్‌లో కిదాంబి శ్రీకాంత్‌ 9-21, 21-12, 17-21తో భారత్‌కే చెందిన యువ షట్లర్‌ మిధున్‌ మంజునాథ్‌ చేతిలో ఓడాడు. మరో పోటీలో ముత్తుస్వామి సుబ్రహనియన్‌ 9-21, 11-21తో చైనీస్‌ తైపీకి చెందిన లిన్‌-చౌన్‌-లి చేతిలో వరుససెట్లలో ఓడాడు. ఇక మహిళల సింగిల్స్‌లో యువ షట్లర్‌ అస్మిత ఛాలిహా జోరు కొనసాగుతోంది. ప్రి క్వార్టర్స్‌లో ఛాలిహా 21-12, 15-21, 21-17తో చైనీస్‌ తైపీకి చెందిన పి-యు-పోను ఓడించి క్వార్టర్స్‌కు చేరింది.

➡️