టాప్‌లోనే సూర్యకుమార్‌

Mar 20,2024 22:15 #Sports

ఐసిసి టి20 ర్యాంకింగ్స్‌ విడుదల

లండన్‌: అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసిసి) విడుదల చేసిన తాజా టి20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా మిస్టర్‌ 360 డిగ్రీస్‌ సూర్యకుమార్‌ టాప్‌లోనే నిలిచాడు. ఐసిసి బుధవారం విడుదల చేసిన బ్యాటర్ల జాబితాలో సూర్యకుమార్‌ యాదవ్‌ 861పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఇది ముంబయి ఇండియన్స్‌కు ఊరటనిచ్చే అంశం. గత మూడు నెలలుగా టి20 క్రికెట్‌కు దూరంగా ఉన్నప్పటికీ సూర్యకుమార్‌ నంబర్‌ వన్‌ స్థానాన్ని నిలబెట్టుకోవడం విశేషం. రెండోస్థానంలో ఇంగ్లండ్‌ సంచలనం ఫిల్‌ సాల్ట్‌(802పాయింట్లు) నిలిచాడు. టీమిండియా యువ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ 714పాయింట్లతో ఏకంగా 6వ స్థానానికి ఎగబాకాడు. ఇక బౌలర్ల ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్‌ స్పిన్నర్‌ ఆదిల్‌ రషీద్‌ అనూహ్యంగా అగ్రస్థానానికి ఎగబాకాడు. తాజా ర్యాంకింగ్‌లో ఆదిల్‌ రషీద్‌ 726పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. ఇక ఐర్లాండ్‌తో జరిగిన మూడు టి20ల సిరీస్‌ను ఆఫ్ఘనిస్తాన్‌ జట్టు 2-1తో చేజిక్కించుకోవడం కీలకపాత్ర పోషించిన రషీద్‌ ఖాన్‌ టాప్‌-10 బౌలర్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు. ఈ సిరీస్‌లో 25ఏళ్ల రషీద్‌ ఖాన్‌ 8వికెట్లు పడగొట్టి ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా నిలిచాడు. బౌలర్ల టాప్‌-10 జాబితాలో అక్షర్‌ పటేల్‌ 4వ, రవి బిష్ణోయ్ 6వ స్థానంలో నిలిచారు.

ఐసిసి టాప్‌-10 బ్యాటర్ల జాబితా..

1. సూర్యకుమార్‌(భారత్‌) : 861పాయింట్లు

2. ఫిల్‌ సాల్ట్‌(ఇంగ్లండ్‌) : 802 ,,

 

3. మహ్మద్‌ రిజ్వాన్‌(పాకిస్తాన్‌) : 800 ,,

4. బాబర్‌ అజామ్‌(పాకిస్తాన్‌) : 764 ,,

5. ఐడెన్‌ మార్‌క్రమ్‌(దక్షిణాఫ్రికా): 755 ,,

6. యశస్వి జైస్వాల్‌(భారత్‌) : 714 ,,

7. రిలే రూసో(దక్షిణాఫ్రికా) : 689 ,,

8. ఫిన్‌ అలెన్‌(న్యూజిలాండ్‌) : 686 ,,

9. జాస్‌ బట్లర్‌(ఇంగ్లండ్‌) : 680 ,,

10. రీజా హెండ్రిక్స్‌(దక్షిణాఫ్రికా): 660 ,,

ఐసిసి టాప్‌-10 బౌలర్ల జాబితా..

1. ఆదిల్‌ రషీద్‌(ఇంగ్లండ్‌) : 726పాయింట్లు

2. వానిందు హసరంగ(శ్రీలంక) : 687 ,,

3. అకెల్‌ హొసైన్‌(వెస్టిండీస్‌) : 664 ,,

4. అక్షర్‌ పటేల్‌(భారత్‌) : 660 ,,

5. మహేశ్‌ తీక్షణ(శ్రీలంక) : 659 ,,

6. రవి బిష్ణోయ్(భారత్‌) : 659 ,,

7. జోష్‌ హేజిల్‌వుడ్‌(ఆస్ట్రేలియా): 654 ,,

8. టాబ్రిజ్‌ షాంసీ(దక్షిణాఫ్రికా) : 654 ,,

9. మిఛెల్‌ సాంట్నర్‌(న్యూజిలాండ్‌): 645 ,,

10. రషీద్‌ ఖాన్‌(ఆఫ్ఘనిస్తాన్‌) : 645 ,,

➡️