పట్టు బిగిస్తున్న ఆసీస్‌

Dec 28,2023 22:10 #Sports

పాకిస్తాన్‌తో బాక్సింగ్‌ డే టెస్ట్‌

మెల్‌బోర్న్‌: పాకిస్తాన్‌తో జరుగుతున్న రెండో, బాక్సింగ్‌ డే టెస్ట్‌లో ఆస్ట్రేలియా పట్టు బిగిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో 54పరుగుల ఆధిక్యత సంపాదించిన ఆస్ట్రేలియా జట్టు మూడోరోజు రెండో ఇన్నింగ్స్‌లో 6వికెట్ల నష్టానికి 187పరుగులు చేసింది. దీంతో ఇప్పటికే 241పరుగుల ఆధిక్యతను సంపాదించిన ఆసీస్‌ చేతిలో మరో నాలుగు వికెట్లు ఉన్నాయి. మూడోరోజు ఆస్ట్రేలియాను సీనియర్‌ బ్యాటర్లు స్టీవ్‌ స్మిత్‌(54), మిఛెల్‌ మార్ష్‌(96) ఆదుకున్నారు. వీరిద్దరూ కలిసి 5వ వికెట్‌కు ఏకంగా 153పరుగులు జతచేశారు. ఖవాజా(0), వార్నర్‌(6), లబూషేన్‌(4), హెడ్‌(0) నిరావపరిచారు. గురువారం ఆట నిలిచే సమయానికి క్యారీ(16) క్రీజ్‌లో ఉన్నాడు. షాహిన్‌ అఫ్రిది, హంజాకు మూడేసి వికెట్లు దక్కాయి. తొలి ఇన్నింగ్స్‌లో పాకిస్తాన్‌ 264పరుగులు చేయగా.. ఆస్ట్రేలియా 318పరుగులు చేశాయి.

➡️