ప్రి క్వార్టర్స్‌కు జకోవిచ్‌, సిట్సిపాస్‌ -ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌

Jan 19,2024 22:12 #Sports

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ పురుషుల సింగిల్స్‌ ప్రి క్వార్టర్‌ఫైనల్లోకి టాప్‌సీడ్‌, సెర్బియాకు చెందిన నొవాక్‌ జకోవిచ్‌ ప్రవేశించాడు. రికార్డు గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్ల వేటలో ఉన్న జకోవిచ్‌ శుక్రవారం జరిగిన మూడోరౌండ్‌లో 6-3, 6-3, 7-6(7-2)తో 30వ సీడ్‌, అర్జెంటీనాకు చెందిన ఎచెవెర్రిను చిత్తుచేశాడు. తొలి రెండు సెట్‌లను సునాయాసంగా నెగ్గిన జకోవిచ్‌.. మూడోసెట్‌ను గెలిచేందుకు టైబ్రేక్‌ వరకు ఆడాల్సి వచ్చింది. ఇతర మూడోరౌండ్‌ పోటీల్లో 10వ సీడ్‌ డిమినార్‌(ఆస్ట్రేలియా) 6-3, 6-3, 6-1తో ఫ్లానియె(ఇటలీ)ను, 12వ సీడ్‌ ఫ్రిట్జ్‌(అమెరికా) 3-6, 6-4, 6-2, 6ా2తో మరొజ్సాన్‌(పోలండ్‌)ను ఓడించారు. ఇక 7వ సీడ్‌ సిట్సిపాస్‌(గ్రీక్‌) 6-3, 6-0, 6-4తో ఎల్‌-వాన్‌-అస్సే(ఫ్రాన్స్‌)ను, 4వ సీడ్‌ సిన్నర్‌(పోలండ్‌) 6-0, 6-1, 6-3తో 26వ సీడ్‌, బేజ్‌(అర్జెంటీనా)ను ఓడించి ప్రి క్వార్టర్స్‌కు చేరారు. గాఫ్‌ జోరు.. మహిళల సింగిల్స్‌లో అమెరికా యువ సంచలనం, 4వ సీడ్‌ కోకా గాఫ్‌ జోరు కొనసాగుతోంది. శుక్రవారం జరిగిన 3వ రౌండ్‌ పోటీలో గాఫ్‌ 6ా0, 6ా2తో సహచర క్రీడాకారిణి పార్క్స్‌ను చిత్తు చేసింది. మరో పోటీలో 2వ సీడ్‌ సబలెంకా(రష్యా) 6-0, 6-0తో 28వ సీడ్‌ సురెంకో(ఉక్రెయిన్‌)ను ఓడించింది. ఇతర పోటీల్లో ఎం. ఫ్రెచ్‌(పోలండ్‌), కోస్ట్యుక్‌(ఉక్రెయిన్‌), మరియా టిమోఫివా(రష్యా)ను చిత్తుచేసి ప్రి క్వార్టర్స్‌కు చేరారు. మూడోరౌండ్‌కు బప్పన్న జోడీ.. భారత ఆటగాడు రోహన్‌ బప్పన జోడీ పురుషుల డబుల్స్‌ మూడోరౌండ్‌లోకి దూసుకెళ్లారు. శుక్రవారం జరిగిన రెండోరౌండ్‌ పోటీలో బప్పన్నాఎబ్డెన్‌(ఆస్ట్రేలియా) జోడీ 6-2, 6-4తో ఆస్ట్రేలియాకు చెందిన మిల్మన్‌ావింటర్‌లను ఓడించారు. 2వ సీడ్‌గా బరిలోకి దిగిన బప్పన్న జోడీ మూడోరౌండ్‌లో 14వ సీడ్‌ ఫ్రాన్స్‌ జంటతో తలపడనుంది.

➡️