బిగ్‌ బాష్‌ లీగ్‌ నుంచి ముజీబ్‌ ఔట్‌

Jan 2,2024 22:10 #Sports

సీడ్ని: బిగ్‌బాష్‌ లీగ్‌(బిబిఎల్‌) ఆడుతున్న ఆఫ్ఘనిస్తాన్‌ స్పిన్నర్‌ ముజీబ్‌ాఉర్‌ారెహ్మాన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ముజీబ్‌ను జట్టు నుంచి తప్పిస్తూ మెల్‌బోర్న్‌ రెనెగేడ్స్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ముజీబ్‌పై నిషేధం విధిస్తూ ఇటీవలే ఆఫ్ఘనిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు(ఎసిబి) నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో మెల్‌బోర్న్‌ రెనెగేడ్స్‌ ఈ నిర్ణయానికి వచ్చింది. ఈ లీగ్‌లో మెల్‌బోర్న్‌ రెనెగేడ్స్‌ తరఫున ఆరు మ్యాచ్‌లు ఆడిన ముజీబ్‌.. ఏడు వికెట్లు తీశాడు. దేశానికి కాకుండా ఫ్రాంచైజీ క్రికెట్‌కు ప్రాధాన్యమిస్తున్నారనే కారణంగా అఫ్గాన్‌ క్రికెట్‌ బోర్డు.. ముజీబ్‌తో పాటు పేసర్లు ఫజల్‌హక్‌ ఫరూఖీ, నవీన్‌ ఉల్‌ హక్‌లు లీగ్‌ క్రికెట్‌ ఆడకుండా రెండేళ్లు నిషేధం విధించింది. అంతేగాక సొంత దేశపు కాంట్రాక్టులను కూడా ఇవ్వమని తేల్చి చెప్పింది. లీగ్‌లు ఆడేందుకు నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌(ఎన్‌ఒసి)లను కూడా అందజేసేది లేదని స్పష్టం చేసింది.

➡️