బెంగాల్‌ రంజీ కెప్టెన్‌గా తివారి

Dec 30,2023 22:15 #Sports

కోల్‌కతా: బెంగాల్‌ రంజీజట్టు కెప్టెన్‌గా సీనియర్‌ క్రికెటర్‌ మనోజ్‌ తివారి ఎంపికయ్యాడు. ఈమేరకు బెంగాల్‌ క్రికెట్‌బోర్డు శనివారం ఓ ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది. బెంగాల్‌ క్రికెట్‌బోర్డు ప్రకటించిన 18మంది ఆటగాళ్ల జట్టుకు కెప్టెన్‌గా తివారి ఎంపికైనట్లు తెలిపింది. రంజీట్రోఫీ తొలి మ్యాచ్‌ను బెంగాల్‌ జట్టు జనవరి 5నుంచి ఆంధ్రప్రదేశ్‌తో 12నుంచి ఉత్తరప్రదేశ్‌తో ఆడనుంది. ఆంధ్రతో జరిగే మ్యాచ్‌ విశాఖపట్నంలోని డా.వై.ఎస్‌ రాజశేఖరరెడ్డి(ఎడోవిడిసిఎ) క్రికెట్‌ స్టేడియంలో జరగనుంది. గత ఏడాది రంజీట్రోఫీ ఫైనల్లో బెంగాల్‌ జట్టు సౌరాష్ట్ర చేతిలో9వికెట్ల తేడాతో ఓడి రన్నరప్‌గా నిలిచింది. జట్టు: మనోజ్‌ తివారి(కెప్టెన్‌), మజుందార్‌, సుదీప్‌ ఘరామి, అభిషేక్‌ పోరెల్‌, సౌరవ్‌ పాల్‌(వికెట్‌ కీపర్‌), శ్రేయంత్‌ ఘోష్‌, రంజోత్‌య సింగ్‌, శుభమ్‌ ఛటర్జీ, ఆకాశ్‌ దీప్‌, ఇషాన్‌ పోరెల్‌, ప్రామానిక్‌, కరణ్‌ లాల్‌, కౌశిక్‌ మింటీ, మహ్మద్‌ కైఫ్‌, అంకిత్‌ మిశ్రా, పి.ఆర్‌. బర్మన్‌, సూరజ్‌ సింధు జైస్వాల్‌, సుమన్‌ దాస్‌.

➡️